నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారుల పై క్లినికల్ ట్రయల్స్, సీరియస్ అయిన కేంద్ర మంత్రి!

గత కొద్దీ రోజులుగా తెలంగాణా రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న ఘటన నిలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు వ్యక్తం అవ్వడం.

ఈ విషయంపై అక్కడ పెను దుమారమే రేగుతుంది.

చిన్న పిల్లల ఆసుపత్రి అయిన నిలోఫర్ ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడకు వచ్చిన చిన్నారులపై వాక్సినేషన్స్ ప్రయోగిస్తున్నారు అన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో పలువురు చిన్నారులు అస్వస్థతకు కూడా గురవుతున్నట్లు చెబుతున్నారు.

అయితే ఇప్పుడు ఈ అంశం పెద్ద హాట్ టాపిక్ గా మారడం తో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది.ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన పై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించినట్లు తెలుస్తుంది.

నిలోఫర్ సూపరింటెండెంట్‌తో.త్రిసభ్య కమిటీ భేటీ అయ్యి.

Advertisement
Central Minister Kishanreddyserious On Niloufer Hospital Clinicaltrials-ని�

ట్రయల్స్‌కు అవలంభిస్తున్న పద్దతులు, ఎథిక్స్ కమిటీ అనుమతులపై విచారణ జరపనుంది.విచారణలో భాగంగా హెచ్‌ఓడీ రవికుమార్, ఆర్ఎంఓ లల్లు ప్రసాద్ నాయక్‌ల స్టేట్ మెంట్‌ను కూడా రికార్డ్ చేయనుంది.

మరోవైపు ఆస్పత్రిలో ఇద్దరు సీనియర్‌ వైద్యుల మధ్య ఆధిపత్యపోరుతో ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ విషయంపై రచ్చ జరుగుతోందని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి.అయితే ఈ ఆరోపణల లో ఎంత నిజం ఉంది అన్న దానిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి కోరినట్లు తెలుస్తుంది.

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ పదవీ విరమణ చేస్తే ఆ కుర్చీని ఆక్రమించుకోవడానికి ఆ ఇద్దరు వైద్యులు తమ ప్రయత్నాల్లో ఉన్నారంటూ ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి.ఇప్పటికే ఈ క్లినికల్ ట్రయల్స్ వల్ల చిన్నారుల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు అంటూ పలువురు తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు.

Central Minister Kishanreddyserious On Niloufer Hospital Clinicaltrials

  వాస్తవానికి క్లినికల్ ట్రయల్స్ అనేవి కొన్ని పద్దతులను అవలంభించి చేయాల్సి ఉంటుంది.దీనికి ముందుగా డ్రగ్స్ సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకొని ఆ తరువాత చిన్నారుల తల్లి దండ్రులకు వివరించి వారి అనుమతి తో వారి సమక్షంలో ఈ ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది.అలాంటిది ఏమాత్రం పద్ధతులు పాటించకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు చిన్నారులపై ట్రయల్స్ చేయడం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు