డాక్టర్ ప్రీతి నాయక్ మృతికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

డాక్టర్ ప్రీతి నాయక్ మృతికి నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రంలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు క్రొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బూర శకుంతల గౌడ్ మాట్లాడుతూమహిళలపై అత్యాచారాలను ఖండించాలని,డాక్టర్ ప్రీతి నాయక్ మృతికి కారణమైన వారిని గుర్తించి దోషులను ఉరి తీయాలని కోరారు.

డాక్టర్ ప్రీతి నాయక్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం చేసి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో మరోసారి ఇలాంటి సంఘటనలు జరగాలంటే భయపడే విధంగా దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు.

Candle Rally To Protest The Death Of Dr. Preeti Naik , Dr. Preeti Naik, Suryapet

ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు అయినాపురం శ్యామలగౌరీ,కౌన్సిలర్లు సలిగంటి సరిత,పలస మహాలక్ష్మి,మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రమీల, పట్టణ మహిళా నాయకురాళ్లు శ్రీలక్ష్మీ, శైలజ,లలిత,కల్పన,పద్మ, నాగరాణి,అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు