బీజేపీపై అలాంటి వ్యాఖ్య‌లు చేసిన బండి సంజ‌య్‌.. షాక్‌లో పార్టీ నేత‌లు

ఒక పార్టీకి అధ్య‌క్షుడిగా ఉన్నాడంటే క‌చ్చితంగా ప్ర‌తి సంద‌ర్భంలో కూడా పార్టీని గొప్ప‌గాన‌నే చూపించే ప్ర‌య‌త్నం చేయాలి.

అప్పుడే కార్య‌క‌ర్త‌ల్లో ప్ర‌జ‌ల్లో ఒక బ‌ల‌మైన న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది.

ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా స‌రే దాన్ని అవ‌కాశంగా చేసుకుని ప్ర‌తిపక్ష పార్టీల‌న్నీ కూడా ట్రోలింగ్ చేయ‌డం ప‌రిపాటిగా మారిపోతుంది.ఇక ఇప్పుడున్న సోష‌ల్ మీడియా ప్ర‌పంచంలో మాట‌లు స్లిప్ అయితే చాలా దారుణంగా విమ‌ర్శ‌ల‌కు గురి కావాల్సి వ‌స్తుంది.

అయితే ఇప్పుడు ఈ కోవ‌లోకి బండి సంజ‌య్ వ‌చ్చి చేరారు.ఆయ‌న పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న క్ర‌మంలో ఎన్నో సార్లు టంగ్ స్లిప్ అయ్యారు.

అయితే ప్ర‌తి సారి వేరే విష‌యాల్లో నోరు జారితే ప‌ర్వాలేదు గానీ ఈసారి మాత్రం ఏకంగా పార్టీపైనే ఆయ‌న నోరు జార‌డం సంచ‌ల‌నం రేపుతోంది.ఇక అస‌లు విష‌యం ఏంటంటే నిన్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు అనుచ‌రులు బీజేపీ కార్పొరేట‌ర్‌పై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఇక ఇదే క్ర‌మంలో బండి సంజ‌య్ ఆ కార్పొరేట‌ర్‌ను ప‌రామ‌ర్శించి అంన‌తరం మీడియాతో మాట్లాడారు.మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు ఇలాంటి వాడ‌ని తెలిసే ఆయ‌న్ను బీజేపీలో చేర్చుకోలేద‌ని చెప్పారు.

ఆయ‌న బీజేపీలో చేరేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేశార‌ని, త‌న కాళ్లు ప‌ట్టుకోవ‌డానికి రెడీ అయ్యార‌ని, కానీ ఆయ‌న ఇలాంటి రౌడీ ఫెలో అనే ఆయ‌న్ను బీజేపీలో చేర్చుకోలేద‌ని బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు.అలాంటి ఫాల్తుగాళ్ల‌ను, కబ్జాదారుల‌ను బీజేపీలో చేర్చుకుంటే పార్టీ ఇంకా భ్ర‌ష్టుప‌డిపోతుంద‌ని అన్నారు.ఇక్క‌డ ఆయ‌న ఇంకా భ్ర‌ష్టు ప‌డుతుంద‌ని అన‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

అంటే ఆల్రెడీ పార్టీ భ్ర‌ష్టు ప‌ట్టి పోయిందా అన్న అనుమానాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.ఇక ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో పార్టీ నేత‌ల‌తో పాటు కార్య‌క‌ర్త‌లు కూడా షాక్‌లో ఉన్నారు.

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి..
Advertisement

తాజా వార్తలు