సిరిసిల్ల సింహ గర్జనను విజయవంతం చేద్దాం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల ఇంచార్జ్ లింగాల సంధీప్ ఆధ్వర్యంలో సిరిసిల్ల సింహ గర్జన భారీ బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఈసి మెంబర్ హజరయ్యారు .

ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మాట్లాడుతూ నవంబర్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాలేజీ గ్రౌండ్ లో సిరిసిల్ల సింహగర్జన సభను బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.ఇట్టి సభకు మన సుప్రీం పేరు తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారన్నారు.

కావున మండల కేంద్రంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, బహుజన విశ్లేషకులు లతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ,అగ్రవర్ణ పేదలు భారీ బహిరంగ సభను లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు.సిరిసిల్ల గడ్డమీద దోపిడీ పాలనను గత ఎన్నికలలో చూసాము.

ఈ 2023 ఎన్నికలలో బీసీ ముదిరాజు ముద్దు బిడ్డ న్యాయవాది పిట్టల భూమేష్ ముదిరాజ్ ని బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది.ఇది దొరలకు బీసీలకు జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో బహుజన బిడ్డ అయిన పిట్టల భూమేష్ ముదిరాజు ను ఆశీర్వదించాలని అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అందె శ్రీనివాస్, మండల కోశాధికారి కొప్పెల్లి రాజు, మండల కార్యదర్శిలు అందే ఈశ్వర్, బొడ్డు కిషన్, సయ్యద్ కరీం,మండల సోషల్ మీడియా కన్వీనర్ గడ్డమీది సాయిచంద్, ఎల్లారెడ్డిపేట టౌన్ అధ్యక్షులు లింగాల నిలేష్, గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు అందె మహేష్, సీనియర్ నాయకులు కరుణాకర్ బహుజన్, నిమ్మపల్లి రాజ్ కుమార్, అందె బాబు, శ్రీకాంత్ లు తదితరులు పాల్గోన్నారు.

బడి బయట విద్యార్థుల గుర్తింపుకు ప్రత్యేక సర్వే
Advertisement

Latest Rajanna Sircilla News