బొత్స vs పవన్ : పాఠాలు ఎవరికి అవసరం ?

తన వరాహి యాత్ర( Varahi yatra ) మొదలు అయినప్పటి నుంచి అధికార అధికార పార్టీతో ఎన్నికల యుద్ధాన్ని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ప్రతి శాఖకు సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా వేదికగా ఎండ గడుతున్నారు.

ఇప్పుడు విద్యాశాఖ వంతు వచ్చినట్లుంది.

ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 50 వేల పై చిలుకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ విషయాన్ని వైసిపి ప్రభుత్వమే రాజ్యసభలో ఒప్పుకుందని ,మరలాంటప్పుడు టీచర్ల నియామకం మీద దృష్టి పెట్టకుండా నష్టాలు లో ఉన్న ఒక స్టార్టప్ కంపెనీకి ఇంత పెద్ద ప్రాజెక్టును ఎందుకు ఇస్తున్నట్లు అని ఇందులో ఉన్న పారదర్శకత ఎంతని పవన్ కళ్యాణ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.అంతేకాకుండా బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన ట్యాబుల కోసం 580 కోట్లకు ప్రభుత్వం ఖర్చు చేసిందని, కంటెంట్ ను మాత్రం ఫ్రీగా ఇచ్చినట్లుగా బై జ్యూస్ కంపెనీ ప్రకటించుకుంటుందని, మరి మళ్ళీ సంవత్సరం కూడా బైజూస్ కంపెనీ అలాగే కంటెంట్ ఫ్రీగా ఇస్తుందా లేక దానికోసం మరొక 580 కోట్ల ఖర్చు పెట్టాలో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంత పెద్ద ఖర్చుతో కూడిన ప్రాజెక్టును ఏ విధమైన టెండర్లు పిలవకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా ఏ విధంగా కేటాయిస్తుందని ఆయన ప్రశ్నించారు.దీనిపై కౌంటర్ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa satyanarayana) పవన్ పూర్తి స్థాయి నిజా నిజాలు తెలుసుకోకుండా కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయడంమే పనిగా ప్రశ్నిస్తున్నారని ,అవసరమైతే నేను ఆయనకు పాఠాలు చెబుతానని అయితే హోంవర్క్ ను బుద్ధిగా చేయాలంటూ చురకలాంటించారు.100 కోట్లు దాటిన ప్రతి టెండర్ను హైకోర్టు సూచించిన న్యాయమూర్తి ద్వారా అనుమతించిన పరిధిలోనే కేటాయిస్తున్నామని, అంతేకాకుండా స్పెసిఫికేషన్స్ పై న్యాయ విచారణకు కూడా అనుమతిస్తున్న ప్రభుత్వం తమదేనని ఆయన చెప్పుకొచ్చారు .

పవన్ కళ్యాణ్( Pawan kalyan ) లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఏడు అంశాలను వివరంగా ఇక్కడ ఇస్తున్నానని పవన్ వాటిని చదువుకోవాలంటూ హితవు పలికారు.బొత్స వాఖ్యలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు తాను అడిగిన ప్రధాన ప్రశ్నలను వదిలేసి ఏదో మాట్లాడుతున్నారని , ప్రశ్నకు సూటిగా సమాదనం ఇస్తే గౌరవిస్తానని ఆయన చెప్పుకొచ్చారు .నష్టాలలో ఉన్న కంపెనీ కి మాత్రమే ఇవాల్సిన అవసరం ఏమిటని , ఇంకా ఏ కంపెనీ టెండర్లకు అప్లై చేయలేదా అంటూ ఆయన నిలదీశారు.మరి ఇందులో పాఠాలు ఎవరికి అవసరమో గుణపాఠాలు ఎవరికి ఎదురు అవుతాయో చూడాలి .

Advertisement
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

తాజా వార్తలు