స్త్రీల లైంగిక సంతృప్తిపై కాజోల్ అలాంటి కామెంట్స్.. ఈరోజుల్లో అలా ఎవరూ లేరంటూ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్( Bollywood Actress Kajol ) నుంచి మనందరికీ తెలిసిందే.

బాలీవుడ్ లో ఎన్నో సినిమాల నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది కాజోల్.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి మెప్పించింది.

ఇది ఇలా ఉంటే కాజోల్ తాజాగా నటించిన చిత్రం లస్ట్ స్టోరీస్ 2.ఈ సినిమా నేడు అనగా జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.సెక్స్, డిజైర్, లవ్‌ను అన్వేషించే నాలుగు కథల సంకలనంగా ఈ సిరీస్ తెరకెక్కింది.

అయితే ఇండియన్ సినిమాలో లస్ట్‌ను( Lust ) ఏ విధంగా చిత్రీకరించి విధానంలో వచ్చిన మార్పుల గురించి తాజా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కాజోల్.ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ.సొసైటీగా ఒక దశలో ఫిమేల్ ప్లెజర్( Female Pleasure ) గురించి చాలా ఓపెన్‌గా ఉన్నాము.

Advertisement

దీని గురించి ప్రాచీన గ్రంథాలు, బోధనల్లో ప్రస్తావించారు.కానీ అభివృద్ధి చెందే కొద్దీ ఆ జ్ఞానాన్ని పట్టించుకోవడం మానేశాము.

కానీ నిజానికి ఇది అందరి జీవితాల్లో ప్రతి రోజు జరిగేదే అని తెలిపింది కాజోల్.అలాగే తినడం తాగడాన్ని ఏ విధంగా సాధారణీకరించామో ఫిమేల్ ప్లెజర్‌ను కూడా అదే విధంగా చూడాలి అని ఆమె తెలిపింది.

సినిమాల్లో లస్ట్ (కామం) పరిణామ క్రమం గురించి కూడా కాజోల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.

గతంలో ఇలాంటి సీన్లు వచ్చినపుడు రెండు ఎర్ర గులాబీలు ఒకదానికొకటి కలిసినట్లుగా చిత్రీకరించి, ఆ తర్వాత గర్భవతి అయినట్లు చూపించేవారు.అందుకే ఒక అడుగు ముందుకేసి, ఈ లస్ట్ స్టోరీస్ 2( Lust Stories 2 ) వంటిది చేయాలని డిసైడ్ అయ్యాం.ఎందుకంటే సినిమాలు సమాజాన్ని ప్రతిబింబిస్తాయని నేను నమ్ముతున్నాను.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

కానీ చాలా సినిమాలు ఇంకా ప్రేమ కోసం చనిపోయే కథలనే చూపిస్తున్నాయి.ఈ రోజుల్లో అలా ఎవరూ లేరు.

Advertisement

అలాంటి లవ్ స్టోరీల మీద నమ్మకం కూడా లేదు.ఒకరు పోతే ఇంకొకరు అనే విధానాన్నే ఫాలో అవుతున్నారు.

మల్టిపుల్ సోల్‌మేట్స్‌నే నమ్ముతున్నారు.అందుకే లస్ట్ స్టోరీస్‌2 సినిమాలోని కథలు ఫ్రెండ్‌షిప్, మోడరన్ రిలేషన్‌షిప్స్, సొసైటీపై ఆధారపడి ఉంటాయి అని చెప్పుకొచ్చింది కాజోల్.

తాజా వార్తలు