ప్రమాదానికి ముందు మేనకోడలితో సౌందర్య చెప్పిన మాటలివే.. అవి కావాలంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటి సౌందర్య ( soundharya )మరణించి చాలా సంవత్సరాలు అయినా సినిమాల ద్వారా ఆమె జీవించి ఉన్నారు.వివాదాలకు దూరంగా ఉన్న సౌందర్య తన సినిమాల ద్వారా పాపులర్ కావడంతో పాటు తన నటనతో ఎంతోమంది అభిమానుల హృదయాలకు దగ్గరయ్యారు.

 Shocking Facts About Soundarya Details Here Goes Viral In Social Media , Niece-TeluguStop.com

అయితే సౌందర్య మేనకోడలు తాజాగా ఒక సందర్భంలో మరణించడానికి ముందు సౌందర్య చెప్పిన విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

చిన్న వయస్సులోనే సౌందర్య మరణించగా ఆమె మరణం వల్ల కొన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి.

మరికొన్ని సినిమాలలో ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలు లేకుండానే సినిమాలు విడుదలయ్యాయి.చిన్న వయస్సులోనే 100కు పైగా సినిమాలలో ఆమె నటించారంటే ప్రేక్షకుల్లో ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Cotton Sarees, Niece, Saffron, Soundarya, Tollywood-Movie

సౌందర్య మేనకోడలు మాట్లాడుతూ తనతో చివరిసారి మాట్లాడిన సమయంలో సౌందర్య కుంకుమ, కాటన్ చీరలు( Saffron , cotton sarees ) కావాలని అడిగారని చెప్పుకొచ్చారు.ఎన్నికల ప్రచారంలో కాటన్ చీర ధరించి పాల్గొంటే బాగుంటుందని భావించి సౌందర్య ఆ విధంగా చేశారని సమాచారం.మేనకోడలు ( niece )నిర్మలను ఒక కాటన్ చీర కచ్చితంగా కొనాలని తన దగ్గర ఒక్క కాటన్ చీర కూడా లేదని ఆమె చెప్పారని సమాచారం.

Telugu Cotton Sarees, Niece, Saffron, Soundarya, Tollywood-Movie

అదే సమయంలో నుదుటన పెట్టుకునే కుంకుమ కూడా కావాలని సౌందర్య మేనకోడలిని కోరారట.ఆ తర్వాత ఫ్లైట్ లో ఎక్కిన సౌందర్య ప్రమాదంలో మృతి చెందారు.సౌందర్య తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరని చెప్పవచ్చు.

సౌందర్య స్థాయి నటీమణి మరొకరు లేరని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ జనరేషన్ లో కూడా సౌందర్యను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube