పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.
ఎప్పుడెప్పుడు ఈ సినిమాను వెండితెర మీద చూస్తామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు.మరి మొత్తానికి మరో నెల రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

దీంతో మేకర్స్ కూడా వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీగా మారనున్నారు.ఇప్పటికే రిలీజ్ చేసిన పలు పోస్టర్స్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా నుండి టీజర్ కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ టీజర్ గురించి ఈ రోజు మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.బ్రో సినిమా టీజర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిముషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.
దీంతో పాటు పవర్ స్టార్ అదిరిపోయే పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.ఫుల్ బ్లాక్ కాస్ట్యూమ్స్ లో పవర్ స్టార్ దేవుడి గెటప్ లో ఉన్నట్టు అనిపిస్తుంది.
మరి ఈ రోజు టీజర్ తో మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతాయో చూడాలి.ఇక ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు.వారాహి యాత్ర చేస్తూ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈయన నటించిన బ్రో సినిమా రిలీజ్ కూడా ఉండడంతో ముందు ముందు ప్రమోషన్స్ కోసం సమయం కేటాయిస్తారా లేదా అని కూడా ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
చూడాలి పవన్ ఏం చేయబోతున్నాడో.







