హైదరాబాద్ లోని జేబీఎస్ నుంచి సీబీఎస్ వెళ్లే మెట్రో ట్రైన్ రాకపోకలలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.ఈ మేరకు జూలై 1వ తేదీ నుంచి జూలై 16 వరకు మెట్రో రైలు వేళలు మారుతాయని అధికారులు తెలిపారు.ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో నడవనుంది.ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా మెట్రో రాకపోకలలో మార్పులు చేస్తున్నట్లు ఎల్ అండ్ టీ అధికారులు వెల్లడించారు.







