ఉడకబెట్టిన శనగలను తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

ఉడికించిన శనగల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అయితే శనగలను పొట్టు తీయకుండా తింటేనే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి.

శనగలను మొలకల రూపంలో తిన్నా కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది.బాదం పప్పులో ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అన్ని ప్రయోజనాలు ఉడికించిన శనగల్లో ఉంటాయి.

శనగలను వారానికి రెండు సార్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.శనగల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉండుట వలన కొలస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.నాన్ వెజ్ తినని వారికీ శనగలు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

Advertisement
Boiled Chickpeas Health Benefits-ఉడకబెట్టిన శనగలన

నాన్ వెజ్ లో ఉండే పోషకాలు అన్ని సనగల్లో ఉంటాయి.కాబట్టి నాన్ వెజ్ తినని వారు బాధపడవలసిన అవసరం లేదు.

ఎందుకంటే శనగలు తింటే ఆ పోషకాలు మన శరీరానికి అందుతాయి.

Boiled Chickpeas Health Benefits

శనగల్లో పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో మినరల్స్ సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.అంతేకాక శనగలు తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండుట వలన ఆకలి త్వరగా వేయదు.అందువల్ల శనగలను తింటే బరువు కూడా తగ్గవచ్చు.

రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరిగి రక్తం బాగా పెరుగుతుంది.దాంతో రక్తహీనత సమస్య రాదు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?

శనగల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ వంటి పోషకాలు ఉండుట వలన నిద్ర బాగా పట్టటమే కాకుండా ఒత్తిడి తగ్గి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు