చిట్లిన జుట్టును నివారించే బ్లాక్ టీ.. ఎలా వాడాలంటే?

జుట్టు చిట్లిపోవ‌డం.మ‌హిళ‌ల్లో చాలా అంటే చాలా కామ‌న్‌గా క‌నిపించే స‌మ‌స్య ఇది.

త‌డి జుట్టును దువ్వ‌డం, హెయిర్ డ్రయ్యర్.హెయిర్ స్ట్రైట్న‌ర్ వంటి వాటిని అధికంగా వాడ‌టం, ఎండ‌ల ప్ర‌భావం, కెమిక‌ల్స్ ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వినియోగించ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు చివ‌ర్లు చిట్లి పోతుంటుంది.

దాంతో జుట్టు ఎదుగుద‌ల తీవ్రంగా దెబ్బ తింటుంది.అదే స‌మ‌యంలో కేశాలు అందవిహీనంగా మారిపోతాయి.అయితే చిట్లిన జుట్టును నివారించ‌డంలో బ్లాక్ టీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అవును, బ్లాక్ టీలో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు చిట్లిన జుట్టును మ‌ళ్లీ మామూలు స్థితికి తీసుకువ‌స్తాయి.మ‌రి లేటెందుకు బ్లాక్ టీని జుట్టుకు ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ముందుగా బ్లాక్ టీని త‌యారు చేసుకుని చల్లార‌బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత అందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను మిక్స్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని జుట్టు మొద‌ళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు స్ప్రై చేసుకుని.గంట‌ అనంత‌రం మైల్డ్ షాంపూతో త‌ల స్నానం చేయాలి.

నాలుగు రోజుల‌కు ఒక సారి ఇలా చేస్తే చిట్లిన జుట్టు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.మ‌రియు జుట్టు మ‌ళ్లీ మ‌ళ్లీ చిట్ల‌కుండా కూడా ఉంటుంది.

అలాగే ఒక క‌ప్పు బ్లాక్ టీలో మూడు స్పూన్ల అలోవెర జెల్‌, ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు మొత్తానికి ప‌ట్టించి.గంట నుంచి రెండు గంట‌ల పాటు ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల చిట్లిన జుట్టు మ‌ళ్లీ మామూలుగా మారుతుంది.

Advertisement

జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.మ‌రియు నిర్జీవంగా ఉన్న కేశాలు ఉత్తేజవంతంగా కూడా మార‌తాయి.

తాజా వార్తలు