నల్ల జీలకర్రను మూటకట్టి వాసన పీలుస్తుంటే ఏమౌతుందో తెలుసా ?

వానాకాలం వచ్చిందంటే చాలు జలుబు,దగ్గు సమస్యలు వేధిస్తూ ఉంటాయి.ఈ సమస్యలు ఎక్కువైతే తల డిమ్ముగా ఉండి ఏ పని మీద ఏకాగ్రత్త ఉండదు.

ఈ సమస్య తగ్గాలంటే ఇంగ్లిష్ మందులు అంతగా పనిచేయవు.ఒకవేళ వాడిన ఆ యాంటీ బయటిక్ మందుల కారణముగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.

అందువల్ల జలుబు తగ్గటానికి మన ఇంటిలో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.ఈ ఇంటి చిట్కాలను పాటించటం వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

చిటికెడు పసుపు, చిటికెడు శొంఠి పొడిని తేనెలో కల్పి తీసుకుంటే దగ్గు తగ్గటమే కాకుండా జలుబు కారణంగా వచ్చే తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.అల్లం రసంలో తేనే కలిపి తీసుకుంటే దగ్గు,జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ మిరియాల పొడి,సరిపడా బెల్లం వేసి మరిగించాలి.

Advertisement

ఈ కాషాయం చల్లారాక త్రాగితే దగ్గు,జలుబు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.ఒక గ్లాస్ పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రి పడుకొనే ముందు త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది పసుపు కొమ్మును కాల్చి ఆ వాసనను పీల్చితే ముక్కు దిబ్బడ తగ్గుతుంది మిరియాల చూర్ణం,బెల్లం సమాన పరిమాణంలో తీసుకోని బాగా కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది ఒక స్పూన్ తేనెలో చిటికెడు మిరియాల పొడి వేసి రోజులో నాలుగు నుంచి ఐదు సార్లు తీసుకుంటూ ఉంటే జలుబు,దగ్గు తగ్గుతాయి చిన్న పిల్లలలో ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు వామును మూట కట్టి వారి పక్కన పెడితే వాము నుంచి వచ్చే ఘాటైన వాసన పిల్చుతారు.

దాంతో ముక్కు దిబ్బడ తగ్గుతుంది.ఒక కప్పు నీటిలో చిన్న అల్లం ముక్క,దాల్చిన చెక్క వేసి మరిగించి ఆ కషాయానికి తేనే కలిపి త్రాగితే జలుబు తగ్గిపోతుంది కొంత మందికి జలుబు చేసినప్పుడు తమ్ములు ఎక్కువగా వాస్తు ఉంటాయి.

అప్పుడు కొత్తిమీర వాసన చుస్తే తుమ్ములు తగ్గుతాయి.నల్ల జీలకర్రను మూట కట్టి అప్పుడప్పుడు నలిపి వాసన చూస్తూ ఉంటే ముక్కుదిబ్బడ నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది.

మరిగే నీటిలో ఉల్లిపాయ ముక్కను వేసి ఆవిరి పడితే ముక్కు దిబ్బడ సమస్య నుండి త్వరగా బయట పడవచ్చు నీటిలో పసుపు,ఉప్పు వేసి కలిపి ఆ నీటితో తరచుగా పుక్కిలిస్తూ ఉంటే త్వరగా తగ్గుతుంది ఈ చిట్కాలతో పాటు రోజులో వీలైనన్ని సార్లు గోరువెచ్చని నీటిని త్రాగండి.

పొగిడిన వాళ్లే నా మొహంపై తిడుతూ కామెంట్స్ చేశారు.. జబర్దస్త్ అవినాష్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు