తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మొదటి నుండి కూడా బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతున్న విషయం తెల్సిందే.ఆర్టీసీ కార్మికుల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందే అని, పక్క రాష్ట్రంలో చేసినట్లుగానే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై ప్రభుత్వంతో ఇప్పటికే బీజేపీ ఫైట్ చేస్తుంది.కేంద్రం వద్దకు ఈ విషయాన్ని తీసుకు వెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్దమవుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు స్పందించారు.
కేంద్రం వద్దకు ఆర్టీసీ కార్మికులను తీసుకు వెళ్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.గవర్నర్‌కు ఫిర్యాదు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయమై ఎలాంటి చర్చలకు కూడా సిద్దం కాకపోవడంపై తీవ్ర స్థాయిలో బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామంటూ చెప్పడంపై కూడా మండి పడ్డాడు.ప్రైవేటీకరణ వల్ల ఆర్టీసీ లాభపడుతుందని అంటున్నారు.అలా అయితే పర్వాలేదు ప్రైవేటీకరణకు ఓకే కాని ప్రైవేటీకరణతో ఆర్టీసీకి నష్టం తప్ప లాభం లేదని లక్ష్మణ్ అన్నారు.