TDP BJP : బీజేపీ కోరుతున్న సీట్లు ఇవే.. ? ఎన్డీఏ లోకి టీడీపీ ? 

2024 ఎన్నికలు( 2024 Elections ) ఆసక్తికరంగా మారబోతున్నాయి.ఈ ఎన్నికల్లో గెలవడం అన్ని ప్రార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.

ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమే ధ్యేయంగా టిడిపి, జనసేన పొత్తు( TDP-Janasena Alliance ) పెట్టుకోవడంతో పాటు, సీట్ల పెంపకాలు చేపట్టాయి.ఇదిలా ఉంటే బిజెపి తమతో కలిసి వస్తుందని ఈ రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.

అయితే బిజెపి విధించిన షరతులతో ఇప్పటి వరకు ఈ విషయంలో ఏ నిర్ణయం జరగలేదు.దీనికి తగ్గట్లుగానే కేంద్ర బీజేపీ పెద్దలు( BJP Senior Leaders ) టిడిపితో పొత్తు విషయమే వేచి చూసే ధోరణి ని అవలంబిస్తుండడం తో టిడిపి జనసేన పంపకాలపై దృష్టి పెట్టాయి.

అయితే బిజెపి తో పొత్తు పై క్లారిటీ ఇప్పటి వరకు రాకపోవడానికి కారణాలు ఉన్నాయి.పొత్తులో భాగంగా బిజెపి కోరుతున్న సీట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, టిడిపి సైతం డైలమాలో పడింది.

Advertisement

పొత్తులో భాగంగా 10 వరకు ఎంపీ స్థానాలు, 20 వరకు అసెంబ్లీ స్థానాలను బిజెపి కోరుతుండడంతో, చంద్రబాబు ఆలోచనలు పడ్డారు.

అయితే ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో ఉన్న బాబు బిజెపి షరతులకు( BJP Conditions ) అంగీకరించినట్లు సమాచారం.బిజెపి కోరుతున్న ఎనిమిది ఎంపీ సీట్లు( MP Seats) 12 నుంచి 15 అసెంబ్లీ స్థానాలను ఇచ్చేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విసావాసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.బిజెపి కోరుతున్న సీట్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.

రాజమండ్రి, నరసాపురం, విశాఖ, ఏలూరు, తిరుపతి, రాజంపేట, హిందూపురం ఎంపీ స్థానాలను ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారుట.అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే.

విశాఖ నార్త్, తాడేపల్లిగూడెం, కైకలూరు, గుంటూరు పశ్చిమ, జమ్మలమడుగు, ధర్మవరం ,రాజమండ్రి సిటీ, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఒక స్థానం ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

అసెంబ్లీ సీట్ల విషయంలో స్థానిక నాయకులతోనూ చర్చలు జరిపి, దీనిపై ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారట.కానీ ఎంపీ స్థానాల విషయంలో ఏ అభ్యంతరం లేదని చంద్రబాబు( Chandrababu ) బిజెపి నేతలకు తెలిపారట.అన్ని కుదిరితే మార్చి ఐదున టిడిపి అధికారికంగా ఎన్డీఏ( NDA )లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుండడంతో, దానికంటే ముందుగానే ఎన్డీఏలో చేరాలని టిడిపి భావిస్తోంది.మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారట.

తాజా వార్తలు