వీడియో: లిఫ్ట్ ఇచ్చిన పాపానికి బైకర్ పర్సే కొట్టేసిన దొంగ.. చివరికి..?

ఈ రోజుల్లో మంచితనానికి రోజులు లేవని చెప్పుకోవచ్చు.కనికరం చూపించి ఒకరికి సహాయం చేసినా చివరికి మనకే చెడు జరుగుతుంది.

చండీగఢ్‌లో( Chandigarh ) ఒక సంఘటన ఈ మాటలను నిజం చేస్తోంది.ఒక బైకర్‌( Biker ) రోడ్డుపక్కన నిలబడి లిఫ్ట్ కోసం ఆశగా చూస్తున్న మరొక వ్యక్తిని చూసి జాలిపడ్డాడు.

ఆ వ్యక్తిని తన బైక్‌పై ఎక్కించుకున్నాడు.కానీ కొంత దూరం వెళ్ళాక, ఆ వ్యక్తి నిజానికి ఒక దొంగ( Thief ) అని తెలుసుకున్నాడు! ఆ దొంగ, బైక్‌ నడుపుతున్న వ్యక్తి జేబు దొంగలించడానికి లిఫ్ట్ అడిగాడు.

కొంత సేపటికి, బైక్‌ నడుపుతున్న వ్యక్తికి ఈ విషయం అర్థమైంది.వెంటనే బైక్ ఆపి, దొంగను కొట్టడం మొదలుపెట్టాడు.

Advertisement

దొంగ పర్సును( Purse ) కొట్టేసినట్లు కూడా తెలుసుకున్నాడు.ఆ దొంగను బైకర్‌ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కొడుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఆ వీడియోలో దొంగ ఎలా పర్సు దొంగతీశాడో స్పష్టంగా కనిపించింది.

ఏదో పాపం అని లిఫ్ట్ ఇస్తే అతడు ఈయనకే బొక్క పెట్టాడు అందుకే కోపంతో ఆగలేక, దొంగను కొట్టడం మొదలుపెట్టాడు.ఆ వ్యక్తి తన పర్సును తిరిగి తీసుకుని, దొంగను కొడుతూనే ఉన్నాడు.ఈ సంఘటన మొత్తం ఒక వీడియోలో రికార్డ్ అయింది.

వీడియోను బైక్ నడుపుతున్న వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఈ సంఘటనను ఎక్స్‌లో ఘర్ కే కాలేష్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేశారు.ఈ సంఘటన భారతదేశంలోని పంజాబ్, చండీగఢ్ రోడ్లపై జరిగినట్లు వినియోగదారులకు తెలియజేస్తుంది.ఇది ఆగస్టు 14 న ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా ఇప్పటికే దీనికి పది లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.

Advertisement

ఈ దొంగ చేసిన పని వల్ల అక్కడ ఎవరికీ లిఫ్ట్ దొరక్కుండా పోయింది.ఈ సంఘటనను చూసిన తర్వాత ఏ బైకర్‌ కూడా అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడానికి ధైర్యం చేయడు.

తాజా వార్తలు