యముడిని అడ్డుకున్న హెల్మెట్.. బైకర్లు ఇది చూడండి!

బైక్ నడిపే చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు.లేదా దగ్గరే కదా ఎందుకులే అనుకుంటారు.

కానీ ప్రమాదాలు చెప్పి రావు.ఎటు నుండి ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు.

కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటారు.బైక్ మీద వెళ్తుంటే తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచిస్తుంటారు.

మీకు హెల్మెట్ పెట్టుకోవడం ఇష్టం లేదా.అయితే ఈ వీడియో చూసి తీరాల్సిందే.

Advertisement

హెల్మెట్ ఎలా మన ప్రాణాలను కాపాడుతుందో తెలుస్తుంది.ఈ ఘటన జరిగింది మన దగ్గర కాదు.

బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరిగింది.ఈ వీడియోను బెంగళూరుకు చెందిన జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ రవికాంతే గౌడ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఓ మలుపు వద్ద బస్సు వస్తుంటుంది.దాని ముందు రోడ్డు నుండి ఓ వ్యక్తి బైక్ పై వేగంగా వస్తాడు.

బస్సు మలుపు తీసుకోవడం చూసి బైక్ ను కంట్రోల్ చేయాలనుకున్నా.కాకపోవడంతో కింద పడిపోతాడు.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

డైరెక్ట్ గా బస్సు వెనక చక్రాల కింద పడిపోతాడు.బస్సు డ్రైవర్ వెంటనే స్పందించి బ్రేక్ వేస్తాడు.

Advertisement

అప్పటికే టైర్ తలపైకి ఎక్కే వరకు వస్తుంది.కానీ తలకు హెల్మెట్ ఉండటంతో ప్రాణాలతో బతికి బట్టకడతాడు.

ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.ఈ వీడియో పోస్టు చేస్తూ ISI మార్కు ఉన్న హెల్మెట్ వాడాలంటూ క్యాప్షన్ ఇచ్చాడు రవికాంతే గౌడ.

తాజా వార్తలు