కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన టేస్టీ తేజ.. ముఖ్య అతిథిగా ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్?

బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా పలువురు కంటెస్టెంట్లు ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ వ్లాగర్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి టేస్టీ తేజ( Tasty Teja ) ఎన్నో రకాల ఫుడ్ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఈయనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈయనకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా చాలా ఫన్నీగా ఉంటూ సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి తేజ ఏకంగా వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టారు.

ఇప్పుడు ఫ్రాంఛైజీ టీ బిజినెస్‌ బాగా పాపులర్‌ అయ్యింది.బాగా రన్‌ అవుతున్న బిజినెస్‌  అని కూడా చెప్పాలి.

Advertisement

ఈ క్రమంలోనే ఇరానీ నవాబ్‌ టీ( Irani Nawabs Tea ) పేరుతో ఫ్రాంఛైజీ టీ బిజినెస్‌ని స్టార్ట్ చేశారు.ఆదివారం సాయంత్రం దీన్ని ఓపెన్‌ చేశారు.కార్పొరేట్‌ స్టయిల్‌లో ఈ టీ బిజినెస్‌ని ప్రారంభించడం విశేషం.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ( Shivaji ) హాజరయ్యారు.ఆయన చేతుల మీదుగానే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అదేవిధంగా అమర్ దీప్, ప్రియాంక జై శుభశ్రీ వంటి వారు కూడా పాల్గొన్నారు.ఇక తేజ ప్రారంభించిన మొదటి బిజినెస్ కావడంతో ఆయనకు మంచి కలగాలని శివాజీ విషెస్ తెలియజేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ కావడంతో అభిమానులు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు