హ్యాపీ డేస్ సినిమా ఆడిషన్ కి వెళ్తే డబ్బులు డిమాండ్ చేశారు... సన్నీ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం వెండితెర అవకాశాలను అందుకున్నటువంటి వారిలో నటుడు వి జే సన్నీ( VJ Sunny ) ఒకరు.

కెరియర్ మొదట్లో యాంకర్ గా పనిచేశారు.

అనంతరం బుల్లితెర నటుడిగా సీరియల్స్ లో నటించే సందడి చేశారు.ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకొని ఈ సీజన్లో విన్నర్ గా నిలిచారు.

ఇక ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈయనకు పలు సినిమాలలో అవకాశాలు వచ్చాయి.ఇలా పలు సినిమాలలో నటిస్తూ సన్నీ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే సన్నీ నటించిన సౌండ్ పార్టీ అనే సినిమా ఈ నెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి సన్నీ తన కెరియర్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులతో పాటు బిగ్ బాస్ కార్యక్రమం( Bigg boss ) గురించి కూడా ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన కెరియర్ మొదట్లో సినిమా అవకాశాల కోసం పడిన ఇబ్బందులను వెల్లడించారు తనకు శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) దర్శకత్వంలో తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమా ఆడిషన్ కి వెళ్ళగా ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యానని అయితే ఈ సినిమాలో నటించాలి అంటే పాతిక లక్షలు ఇవ్వాలని అడిగారు అంత డబ్బు ఇచ్చే స్థోమత నాకు లేకపోవడంతో నేను ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్నానని సన్నీ తెలిపారు.అప్పటినుంచి తాను ఎంతో కష్టపడుతూనే ఉన్నానని ఈయన ఈ సందర్భంగా తెలియచేశారు.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు