ఇట్స్ అఫీషియల్.. ఆరోజు నుంచి బిగ్ బాస్ షో.. ఈ షో టైమింగ్స్ ఏంటంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్8 ( Bigg Boss Show Season 8 )కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ షోకు సంబంధించి ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది.

సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొంతమంది సెలబ్రిటీల పేర్లు ప్రచారంలోకి రాగా దాదాపుగా వాళ్ల పేర్లే ఫైనల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో నాగార్జున పేరు పలు వివాదాల ద్వారా వార్తల్లో వినిపించినా నాగ్ మాత్రం కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే బిగ్ బాస్ షో ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా ఎనిమిదో సీజన్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.

Bigg Boss Show Season 8 Timings Details Inside Goes Viral In Social Media ,bigg

ఈ సీజన్ లో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫన్, ట్విస్ట్ లు, టర్న్ లకు లోటే లేదని నాగ్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ షో సీజన్8 కు ఏ రేంజ్ లో రేటింగ్స్ వస్తాయో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో అభిమానులు సైతం ఈ సీజన్ సక్సెస్ కావాలని కోరుకుంటుండగా వాళ్ల కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.

Advertisement
Bigg Boss Show Season 8 Timings Details Inside Goes Viral In Social Media ,Bigg

పెద్దగా క్రేజ్ లేని కంటెస్టెంట్లు ఈ షోకు వస్తారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Bigg Boss Show Season 8 Timings Details Inside Goes Viral In Social Media ,bigg

బెజవాడ బేబక్క, అభయ్, 7 ఆర్ట్స్ సీత, ఢీ నైనిక( Bejawada Bebakka, Abhay, 7 Arts Sita, Dhi Nainika ), కావ్య నిఖిల్ జోడీలో నిఖిల్, ఖయ్యూమ్ అలీ, అంజలి భవన్, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, విష్ణుప్రియ, రీతూ చౌదరి, విస్మయిశ్రీ, యష్మీ గౌడ ఈ షోలో పాల్గొననున్నారని తెలుస్తోంది.బిగ్ బాస్ షో వివరాలు లీక్ కాకుండా నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా.

Advertisement

తాజా వార్తలు