బిగ్ బాస్ రెమ్యూనరేషన్ మొత్తం వారికి విరాళంగా ప్రకటించిన బేబక్క?

బిగ్ బాస్( Bigg Boss 8) తెలుగు సీజన్ 8 కార్యక్రమం ఇప్పటికే ఒక వారం పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే .14 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబరు ఒకటవ తేదీ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభం అయింది.

ఇలా మొదటి రోజు 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్ళగా ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా మరికొంతమంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఇక హౌస్ లోకి వెళ్లిన 14 మంది కంటెస్టెంట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున టాస్కులలో పోటీలు పడుతూ వస్తున్నారు అయితే మొదటి వారమే ఈ హౌస్ నుంచి బెజవాడ బేబక్క( Bebakka ) బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

మొదటి వారమే నామినేషన్ లో ఉన్నటువంటి ఈమె ఎలిమినేట్ అయ్యారు.ఇక ఈమె వారానికి గాను సుమారు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ ( Remuneration ) అందుకున్నారని తెలుస్తుంది.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఈమె పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మిగిలిన కంటెస్టెంట్లకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.నిఖిల్ పదునైన కత్తిలాంటి వాడని రెండు వైపులా పదును ఉన్న వ్యక్తి అని తెలిపారు.

Advertisement

ఇక హౌస్ లో ఉన్నటువంటి నాగ మణికంఠ చాలా ప్లానెట్ గా గేమ్ ఆడుతున్నారని తెలిపారు .అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో ఈమె అందుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేయకపోయినా తాను వారం రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఇచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఈమె విజయవాడ వరద ( Vijayawada Floods ) బాధితుల కోసం విరాళంగా ప్రకటించబోతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఇక ఈమె సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె 70 కోట్ల విలువచేసే వాచ్ అలాగే 180 కోట్ల విలువ చేసే హ్యాండ్ బ్యాగ్ తో వచ్చాను అని చెప్పడంతో యాంకర్ తో పాటు నేటిజన్స్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.ఇలా 180 కోట్లు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బేబక్క ఏకంగా బిగ్ బాస్ హౌస్ నే కొనవచ్చు మరి కంటెస్టెంట్ గా ఎందుకు వెళ్లారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

దేవర హిందీ ప్రమోషన్ల కోసం టాప్ స్టార్లు.. యంగ్ టైగర్ ప్లాన్ వేరే లెవెల్ లో ఉండనుందా?
Advertisement

తాజా వార్తలు