ఎట్టకేలకు రైతు బిడ్డకే ఎవిక్షన్ పాస్.. ఇదే దూకుడుతో కప్ కూడా కొడతాడా?

బిగ్ బాస్( Bigg Boss ) అంటే ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మరి తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 6 సీజన్స్ ముగించుకోగా ఇప్పుడు 7వ సీజన్ స్టార్ట్ అయ్యింది.

7వ సీజన్ ( Bigg Boss7 Telugu ) అప్పుడే 11 వారాలు సక్సెస్ ఫుల్ గా ముగించుకుని 12వ వారం కూడా అడుగు పెట్టింది.ఈ వారంలో హౌస్ లో పోటీ రసవత్తరంగా జరిగింది.

ముందుగా ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో పాటు మధ్యలో 5వ వారంలో 5 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.అంతా కలిసి ఇప్పుడు హౌస్ లో 10 మంది సభ్యులు ఉన్నారు.

వీరికి నామినేషన్స్ జరుగగా ఈ వారం 8 మంది నామినేట్ అయ్యారు.

Advertisement

ఈసారి కూడా నామినేషన్స్ లో రచ్చ బాగానే జరిగింది.మొత్తంగా ఎన్నో వాదోపవాదనలు వాడీవేడి చర్చ తర్వాత ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ గా ప్రియాంక ఉండదు కాబట్టి ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు.అలాగే ఈ వారం శోభాను కూడా ఎవ్వరు టార్గెట్ చేయలేదు.

దీంతో వీరిద్దరూ మినహా మిగిలిన వారంతా నామినేషన్స్ లో ఉన్నారు.

ఇక గత వారం స్టార్ట్ అయ్యిన ఎవిక్షన్ పాస్ యావర్( Prince Yawar ) దక్కించుకోగా ఫాల్స్ గేమ్ ఆడావు అంటూ నాగ్ అనడంతో ఎవిక్షన్ పాస్ ఇచ్చేసాడు.మరి ఇదే పాస్ కోసం ఈ వారం నామినేషన్స్ జరుగగా ఈ వారం రైతు బిడ్డ ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నాడు.అందరితో పోటీ పడి గెలిచి ఏవిక్షన్ పాస్ ను సొంతం చేసుకోవడంతో పల్లవి ప్రశాంత్ ను యావర్, శివాజీ( Shivaji ) తెగ పొగిడేశారు.

ఇక పాస్ సొంతం అవ్వడంతో ప్రశాంత్ ఎలిమినేషన్స్ నుండి సేవ్ అయ్యాడు.ఇతడి జోరు చూస్తుంటే ఈ వారం అందరిని వెనక్కి నెట్టి మరీ టైటిల్ విన్నర్ కూడా అయ్యేలా కనిపిస్తున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మరి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండడంతో వీరిలో ఏ ఇద్దరు బయటకు వెళ్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు