బిగ్ బ్రదర్ రివ్యూ.. వర్కౌట్ అయిన సెంటిమెంట్!

దర్శకసంచలనం రాజమౌళి ఆఫ్ భోజ్‌పూరి గోసంగి సుబ్బారావు చాలా విరామం తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారు.

ఆయన దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ "బిగ్ బ్రదర్"(Big brother) మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లైట్ హౌస్ సినీ మ్యాజిక్(Lighthouse Cinema Magic) పతాకంపై కె.ఎస్.శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు.ఈ చిత్రంలో శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషించారు.

జి.రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటా శ్రీనివాసరావు కార్యనిర్వాహక నిర్మాత.శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ

Advertisement

శివ (శివ కంఠమనేని)(Siva Kantamaneni), గౌరి (ప్రియ హెగ్డే)(Priya Hegde )లు ఒకే ఇంట్లో ఉంటారు.ఎంగేజ్మెంట్ జరిగి పదేళ్లు అయినా పెళ్లి మాత్రం చేసుకోరు.శివ సోదరుడు సూర్య (శ్రీ సూర్య) కాలేజ్ నుంచి హైద్రాబాద్‌లోని ఇంటికి వస్తుండగా అటాక్ జరుగుతుంది.

ఆ అటాక్ నుంచి తమ్ముడ్ని కాపాడుకుంటాడు శివ.బయటకు వెళ్లకు.వెళ్తే ప్రమాదం అని చెప్పినా కూడా సూర్య వినడు.

అన్న మాటను పట్టించుకోడు.వదినకు కాకమ్మ కబుర్లు చెబుతూ బయటకు వెళ్తుంటాడు.

అలా బయటకు వెళ్లిన సూర్య.పూజ (ప్రీతి)ను చూసి ఇష్టపడతాడు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఇక పూజ సైతం సూర్యను ఇష్టపడుతుంది.ఒకసారి సూర్య, పూజల మీద అటాక్ జరుగుతుంది.

Advertisement

ఈ అటాక్ సూర్య మీద జరిగిందని శివ అనుకుంటాడు.కానీ పూజ కోసం అటాక్ జరుగుతుంది.

సూర్య, శివలు ఆ అటాక్‌ను తిప్పి కొడతారు.అసలు పూజ ఎవరు? పూజ మీద అటాక్ చేసింది ఎవరు? సూర్యకు పూజకు ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? శివ గతం ఏంటి? శివ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉంటాడు? పూజ తండ్రి మంత్రి (రాజేంద్ర) పాత్ర ఏంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు

శివ కంఠమనేని బిగ్ బ్రదర్(Shiva Kanthmaneni Big Brother) సినిమాలో శివ పాత్రలో కనిపించిమెప్పించాడు.శివ కారెక్టర్‌లో చూపించాల్సిన ప్రేమ, కోపం ఇలా అన్ని ఎమోషన్స్‌ను చూపించాడు.ఇక యాక్షన్ సీక్వెన్స్‌లో మంచి ఎనర్జీతో దుమ్ములేపేశాడు.

శివ పాత్ర తరువాత ఈ చిత్రంలో సూర్య పాత్రే హైలెట్ అవుతుంది.ఫస్ట్ హాఫ్‌లో భయస్తుడిలా, సెకండాఫ్‌లో కాలేజీ కుర్రాడిలా, అల్లరి పాత్రలో మెప్పించాడు.

గౌరి పాత్రలో ప్రియ హెగ్డే అందంగా ఉంది.పూజ కారెక్టర్‌లో ప్రీతి గ్లామరస్‌గా ఆకట్టుకుంది.

భవానీ, దేవ్, మంత్రి పాత్రలు విలనిజాన్ని చూపించాయి.నానమ్మ పాత్ర అక్కడక్కడా నవ్వులు పూయించింది.

విశ్లేషణ

ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఈ కథను దర్శకుడు రాసుకున్నాడు.ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది.అన్న, తమ్ముళ్ల రిలేషన్, వదిన ప్రేమ, నానమ్మ అల్లరి ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను జోడించి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు.

కామెడీ కూడా బాగానే పండింది.ఫైట్స్, పాటలకు కరెక్ట్ ప్లేస్ మెంట్ దొరికింది.ఇక ఫస్ట్ హాఫ్ చూస్తేనే ఫుల్ మీల్స్ అన్నట్టుగా కనిపిస్తుంది.

ఇంటర్వెల్ హీరోలిద్దరూ కలిసి చేసే ఫైట్ బాగుంటుంది.సెకండాఫ్‌లో సినిమా ఫ్లాష్ బ్యాగ్‌లోకి వెళ్తుంది.

అక్కడ కాలేజ్ ఎపిసోడ్స్ బాగుంటాయి.ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది.

హీరో హీరోయిన్ల మధ్య గిల్లికజ్జాలు, ఒకరినొకరు ర్యాగింగ్ చేసుకోవడం, ప్రేమ పుట్టడం, హీరోయిన్ తండ్రి నుంచి వచ్చిన సమస్యలు.ఇలా ప్రీ క్లైమాక్స్ వరకు కథ బాగా వెళ్తుంది.

అయితే ఈ కాలేజ్ ఫ్లాష్ బ్యాక్‌తో పాటుగా ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది.ఎందుకు శివ అలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సి వచ్చిందనే పాయింట్ చక్కగా, ఎమోషనల్‌గా చూపించారు.

క్లైమాక్స్‌లో తమ్ముడి ప్రేమను గెలిపించేందుకు అన్న చేసే పోరాటం, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ బాగుంటాయి.చివరకు కథ సుఖాంతం అవుతుంది.

బిగ్ బ్రదర్ మూవీకి సంగీతం పర్వాలేదనిపిస్తుంది.పాటలు చూడటానికి బాగుంటాయి.

కెమెరామెన్ నటీనటుల్ని అందంగా చూపించాడు.నిడివి తక్కువగానే ఉండటం వల్ల అంత బోరింగ్‌గా అనిపించదు.

నిర్మాత పెట్టిన ఖర్చుకు తగ్గ ఫలితం వచ్చినట్టుగా అనిసిస్తుంది.ఈ మూవీ బీ, సీ సెంటర్లతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేలా ఉంది.

మరి కమర్షియల్‌గా ఫలితం ఎలా వస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

రేటింగ్

: 3/5.

తాజా వార్తలు