కొత్త పార్లమెంట్ భవనంకు భూమి పూజ

ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం పక్కన కొత్త పార్లమెంట్ భావనాని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని నరేంద్ర మోడి నివాసానికి వెళ్ళి ఈ నెల 10న భూమి పూజ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించాడు.

ఈ భవన నిర్మాణం కోసం 940 కోట్లు ఖర్చు అవ్వుతుందని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అంచన వేసింది.ఈ ప్రాజెక్ట్ కోసం టాటా, ఎల్ అండ్ టి బిడ్ వేశాయి.టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ 861.90 కోట్లకు బిడ్ వేసింది.ఎల్ అండ్ టీ టాటా కంటే ఎక్కువగా 865 కోట్లకు బిడ్ వేసింది.

కానీ పార్లమెంట్ భవన నిర్మాణ ప్రాజెక్ట్ ను తక్కువ బిడ్ వేసిన టాటా ప్రాజెక్ట్ దక్కించుకుంది.కొత్త పార్లమెంట్ భవనం త్రిభుజాకారంలో ఉంటుంది.1200 మంది ఎం‌పి లకు సరిపడేలా ఈ భవనం ఉంటుంది.ఎం‌పి లకోసం లాంజ్, లైబ్రరీ, పెద సంఖ్యలో కమిటీ గదులు, సువిశాలమైన కార్ పార్కింగ్ స్థలం.

పెద డైనింగ్ ఏరియాలు.భూకంపాలను తట్టుకునేలా అత్యదునిక సాంకేతికతో నిర్మించనున్నారు.

Advertisement

ఈ నిర్మాణంలో భాగంగా 2 వేల మంది కి ఉపాధి దొరుకుతుంది.పరోక్షంగా 9 వేల మంది ఉపాధి పొందుతారని ఓం బిర్లా తెలిపాడు.

సునామీలో టి సైలెంట్ నా ముందు నువ్వు సైలెంట్.. ఈ సినిమాతో శ్రీలీలకు హిట్టొస్తుందా?
Advertisement

తాజా వార్తలు