భీమ్లా నాయక్ సాంగ్ వాయిదా.. కారణం అదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్.

మలయాళంలో సూపర్ హిట్ అయినా అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాకు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమాను సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.

పవన్ కారణంగా ముందు నుండే అంచనాలు ఉన్నా కూడా ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్ ల కారణంగా మరిన్ని అంచనాలు పెరిగాయి.ఇక మాటల మాంత్రికుడు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అందిస్తుండడంతో ఈ సినిమా మరోక రేంజ్ కు వెళ్ళిపోయింది.

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.దాంతో ప్రమోషన్స్ నెల ముందు నుండే స్టార్ట్ చేశారు.

Advertisement

అప్డేట్ అప్డేట్ కు ఎక్కువ గ్యాప్ లేకుండా వరుస అప్డేట్ లు ఇవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన మూడు పాటలు సోషల్ మీడియాలో  ఏ విధంగా హల్ చల్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తమన్ అందించిన సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా అలరించింది.

ఇక నిన్న ఈ సినిమా నుండి నాలుగవ పాటను డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.అడవి తల్లి మాట అనే పాటను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయాల్సి ఉండగా ఈ సినిమా మేకర్స్ ఈ పాటను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సాంగ్ ను రిలీజ్ చేయక పోవడానికి సాహిత్య దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం అని తెలుస్తుంది.టాలీవుడ్ ఒక లెజెండరీని కోల్పోయింది.ఈ విషాద సమయంలో ఇలాంటి అప్డేట్ లు సరైనది కాదని అందుకే ఆయన గౌరవార్ధం ఈ పాటను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

మరి ఈ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా ప్రకటించలేదు.త్వరలోనే మేకర్స్ మరొక కొత్త డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు