భావనతో అలాంటి ప్రయోగమా..!

మళయాళ భామ భావన కెరీర్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ వరుస సినిమాలతో సత్తా చాటుతుంది.

తెలుగులో కూడా ఆమెని చేసిన ఒంటరి, మహాత్మ సినిమాలతో ఇక్కడ ఆడియన్స్ కు దగ్గరైంది.

ఆమధ్య తనపై జరిగిన లైంగిక దాడి కేసుపై నేషనల్ వైడ్ గా హాట్ న్యూస్ గా మారింది భావన.ఆ తర్వాత బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.

అయితే హీరోయిన్ గా కాకపోయినా స్పెషల్ రోల్స్ చేస్తూ వస్తుంది భావన.ఈ క్రమంలో తెలుగులో కూడా భావనకి ఛాన్స్ లు వస్తున్నాయి.

ఓ నిర్మాత భావనతో ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా ప్లాన్ చేస్తున్నారట.అది కాస్త బోల్డ్ గా ఉంటుందని టాక్.భావనకి తెలుగు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.

Advertisement

ఈ సినిమా తెలుగుతో పాటుగా మళయాళంలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించిన డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.

భావన లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం నిజమైతే మాత్రం ఆమె ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే.మరి భావన చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఇంతకీ ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు మిగతా స్టార్ కాస్ట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది..

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు