యాదవులకు క్షమాపణ చెప్పాలి రాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం నాయకుల డిమాండ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) లో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో జిల్లా యాదవుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఏకగ్రీవంగా మద్దతు ఇస్తున్నామని యాదవ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మీరాల భాస్కర్ యాదవ్ ప్రకటించడం అవివేకమనీ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కు దేవేందర్ యాదవ్ అన్నారు.

గురువారం సిరిసిల్ల పట్టణం లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ యాదవ సంక్షేమ సంఘం పేరిట మీకే మద్దతు ఇస్తున్నామని భాస్కర్ యాదవ్( Bhaskar yadav ) నీకు అవసరం ఉంటే మంత్రి కెటిఆర్ బూట్లు నాకుమని అంతే తప్ప యాదవుల ఆత్మగౌరవంను తాకట్టు పెట్టకూడదని దేవేందర్ యాదవ్ అన్నారు.

కేవలం రాష్ట్రంలో అఖిల భారత యాదవ మహా సభ, యాదవ హక్కుల పోరాట సమితి లు మాత్రమే రిజిష్టర్ సంస్థలు అని మిరాల భాస్కర్ యాదవ్ పెట్టుకున్న సొంత జేబు సంస్థ గా పెట్టుకున్నదని ఆది బి ఆర్ ఎస్ సంస్థ అని,మిరలా భాస్కర్ యాదవ్ ను ఉరికించి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అసరీ బాల్ రాజ్ యాదవ్ అన్నారు.గంభీరావుపేట మండలం( Gambhiraopet ) ముస్తాఫానగర్ గ్రామ సర్పంచ్ కొక్కు సంద్యా రాణి యాదవ్ కు ,జగిత్యాల టౌన్ ఎస్.ఐ అనిల్ యాదవ్ ను విధుల నుండి సస్పెండ్ చేసినప్పుడు ఎక్కడ పడుకున్నవని మిరాల భాస్కర్ యాదవ్ ను అఖిల భారత యాదవ మహా సభ రాష్ట్ర నాయకులు వాసం మల్లేష్ యాదవ్ ప్రశ్నించాడు.ప్రతి గ్రామ గ్రామాన భాస్కర్ యాదవ్ బి ఆర్ ఎస్( BRS ) కు మద్దతు గా ప్రచారానికి వస్తె అడుగడుగునా అడ్డుకోవాలని మల్లేశం యాదవ్ పిలుపునిచ్చారు.

అదే విధంగా దమ్ముంటే మంత్రి కెటిఆర్ మీదనే ఎం ఎల్ ఏ గా పోటీ చేయాలని అప్పుడు జిల్లాలో ఉన్న యాదవులు అందరూ నీకు మద్దతు ఇస్తారని యాదవుల ఆత్మాభిమానం తాకట్టు పెట్టడం సరైనది కాదని బేషరతుగా యాదవ జాతికి క్షమాపణ చెప్పాలని అఖిల భారత యాదవ మహా సభ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒగ్గు బాలరాజు యాదవ్ మిరాల భాస్కర్ యాదవ్ కు సవాలు విసిరారు.ఈ విలేఖరుల సమావేశంలో యాదవ సంఘం జిల్లా నాయకులు మిరాల శ్రీనివాస్ యాదవ్,వేల్పుల సాయి ప్రసాద్ యాదవ్, తంగళ్ళపల్లి యాదవ సంఘం మండల అధ్యక్షుడు గోగు మల్లేశం యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి మాందాటి తిరుపతి యాదవ్,అంబటి చందు యాదవ్, మారవెని చంద్రశేఖర్ యాదవ్, మిరాల సత్యం యాదవ్,సోల్ల కుమార్ యాదవ్,పొన్నవెని ప్రశాంత్ యాదవ్,అలువాల నరహరి యాదవ్,ఉడుత నరేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News