ఈరోజు భద్రాద్రి దేవస్థానం సమాచారం.. యాదాద్రి భక్తులకు అందుబాటులోకి ఆన్లైన్ సేవలు..

మన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రంలో ఈరోజు జరిగే నిత్య పూజలను ఇప్పుడు తెలుసుకుందాం.దేవాలయం తెరిచే సమయం తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు, ఉదయం 4:30 నుంచి 5 గంటల వరకు సుప్రభాత సేవ ఉంటుంది.

ఐదు గంటల 30 నిమిషాల నుంచి ఏడు గంటల వరకు బాల భోగం, అంతేకాకుండా 7 నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాలు ఉంటాయి.ఇంకా చెప్పాలంటే ఏడు గంటల 30 నిమిషాల నుంచి ఒకటి వరకు అంతరాలయంలో అర్చన చేస్తారు.9:30 నుంచి ఈ 11:30 వరకు నిత్య కళ్యాణం ఉంటుంది.11:30 నుంచి 12 వరకు మధ్యాహ్న రాజభోగం ఉంటుంది.మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు దేవాలయం ద్వారా బంధనం చేస్తారు.

ఆ తర్వాత మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంతరాలయంలో అర్చన చేస్తారు.రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు దర్బారు సేవ, ఎనిమిది గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 వరకు నివేదన భోగం, స్వామివారి పవళింపు సేవ ఉంటుంది.

రాత్రి 9 గంటల 30 నిమిషములకు దేవాలయ ద్వారబంధనం చేస్తారు.

Bhadradri Devasthanam Information Today Online Services Available For Yadadri De

యాదాద్రికి వెళ్లే భక్తులకు ఇది అదిరిపోయే శుభవార్త అని చెప్పవచ్చు.ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు సులభంగా సేవలు అందించేందుకు దేవాలయ అధికారులు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.దీనివల్ల అన్ని రకాల సేవలను మొబైల్ లోనే బుకింగ్ చేసుకోవచ్చని యాదాద్రి దేవాలయ కమిటీ వెల్లడించింది.

Advertisement
Bhadradri Devasthanam Information Today Online Services Available For Yadadri De

Yadadritemple.telangana.gov.in అనే వెబ్సైట్ లో యాదాద్రికి వచ్చే భక్తులు తమకు కావాల్సిన సేవలను పైన తెలిపిన వెబ్సైట్ ద్వారా పొందవచ్చని ఆలయ అధికారులు చెబుతున్నారు.

అయితే ఇటువంటి యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు కూడా దర్శనాల టికెట్లను తీసుకొచ్చారు.ఇక ఇప్పుడు ఆన్లైన్ సేవలను తీసుకొచ్చి భక్తులకు సేవలను సులభంగా అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు