స్మూత్ అండ్ స్ట్రైట్ హెయిర్ కోసం ఆరాటపడుతున్నారా? అయితే ఇలా చేయండి!

కురులు స్మూత్ అండ్ స్ట్రైట్ గా మెరుస్తూ ఉంటే చూపరులకు మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తాయి.అందుకే చాలా మంది హెయిర్ స్ట్రెయిట్నర్ వాడుతుంటారు.

అయితే హెయిర్ స్ట్రెయిట్నర్ ను తరచూ వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.జుట్టు బలహీనంగా మారి హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.

అలా కాకుండా సహజంగా కూడా స్మూత్ అండ్ స్ట్రైట్ హెయిర్ ను త‌మ‌ సొంతం చేసుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి.

Advertisement

అలాగే ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ పోసి బాగా మిక్స్ వేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రైస్ వాటర్ ను వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఇప్పుడు ఉడికించిన మిశ్ర‌మం నుంచి స్ట్రైనర్ సహాయంతో రైస్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ రైస్ క్రీమ్ లో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివరి వరకు పట్టించాలి.

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు కనుక చేస్తే జుట్టు సహజంగానే స్మూత్ అండ్ స్ట్రైట్ గా‌ మారుతుంది.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?
ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు చిట్లడం, రాలడం, విరగడం వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Advertisement

తాజా వార్తలు