ఖరీదైన క్రీములు అక్కర్లేదు.. ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకోండిలా!

చాలా మంది తమ ముఖ చ‌ర్మం తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని తెగ ఆరాట‌ప‌డుతుంటారు.

అందుకోసమే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్( Skin whitening creams ) ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

వీటి కోసం ప్రతి నెల వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.

అందంగా మెరిపించుకోవ‌చ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

Advertisement

మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఎండిన గులాబీ రేకులు మరియు ఒక కప్పు ఎండిన మందార పూలు( Hibiscus flowers ) వేసుకుని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న గులాబీ మందారం పొడిని వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ), హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్‌ ఆయిల్( Almond oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ రోజ్‌ వాటర్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఏదైనా బ్రష్ సహాయంతో పూత‌లా అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఆపై మంచి మాయిశ్చరైజ‌ర్ ను చర్మానికి అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం సహజంగానే తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.ఎలాంటి ఖరీదైన క్రీములు అక్కర్లేదు.

సహజంగానే చర్మాన్ని తెల్లగా మార్చడానికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

మృత కణాలు తొలగిపోతాయి.చర్మం నిగారింపు గా మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు