బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటే.. షుగ‌ర్ కంట్రోల్ అవ్వ‌డం ఖాయం?

మధుమేహం లేదా డ‌యాబెటిస్ లేదా షుగ‌ర్ వ్యాధి.పేరు ఏదైనా జ‌బ్బు మాత్రం ఒక్క‌టే.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మంది షుగ‌ర్ వ్యాధితో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామాలు చేయ‌క‌పోవ‌డం, ఎక్కువ స‌మ‌యం కూర్చోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌ధుమేహం వ్యాధి బారిన పడుతుంటారు.

ఒక ఒక్క సారి మ‌ధుహహం వ్యాధి ఒంట్లోకి వ‌చ్చిందంటే.జీవితాంతం న‌ర‌కం చూపిస్తూనే ఉంటుంది.

అందుకే మ‌ధుమేహం అంటే చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు.ఇక మ‌ధుమేహం వ్యాధి బారిన ప‌డిన వారు.

Advertisement
Best Breakfast For Diabetes Patients Best Breakfast, Diabetes Patients, Diabetes

ఎప్పుడూ స‌రైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.అప్పుడే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

అయితే కొన్ని ఆహారాలు ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ సులువుగా కంట్రోల్ చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

మొలకెత్తిన గింజలు.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, బ్రేక్ ఫాస్ట్‌లో అనేక పోషకాలు నిండి ఉండే మొలకెత్తిన గింజలు చేర్చుకోవాలి.సంపూర్ణ ఆహార‌మైన గుడ్డు పిల్ల‌ల‌కే కాదు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

పెద్ద‌ల‌కు కూడా ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెరస్థాయిని తగ్గించడం మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో గుడ్డు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డు‌తుంది.

Advertisement

కాబ‌ట్టి, మ‌ధుమేహం ఉన్న వారు బ్రేక్ ఫాస్ట్‌లో ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ రూపంలో తీసుకుంటే మంచిది.అలాగే మల్టీగ్రెయిన్ ఇడ్లీల‌ను మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే చాలా మంది.

అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో బాదం కూడా సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.అందువ‌ల్ల‌, ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో నాన బెట్టిన బాదం ప‌ప్పుల‌ను ఐదు లేదా అరు చ‌ప్పున తీసుకోవాలి.ఇక వీటి పాటుగా తాజా కూర‌గాయ‌ల‌తో త‌యారు చేసిన స‌లాడ్లు, ఓట్స్, మెంతికూరతో త‌యారు చేసిన‌ పరాటాలు వంటివి తీసుకోవాలి.

తాజా వార్తలు