ఖాళీ కడుపుతో కివి పండు తింటే ఏం అవుతుందో తెలుసా?

కివి.ప్ర‌కృతి మ‌న‌కు ప్ర‌సాదించిన అద్భుతమైన పండ్ల‌లో ఇది ఒక‌టి.

ప్ర‌త్యేక‌మైన రుచిని క‌లిగి ఉండే కివి పండులో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, విట‌మిన్ బి, ఐర‌న్‌, మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌తో పాటు శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా కివి పండు బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తుంది.

అయితే ఆ ప్ర‌యోజ‌నాలు తినే స‌మ‌యం బ‌ట్టీ కూడా ఆధారప‌డి ఉంటాయి.ముఖ్యంగా ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో కివి పండు తింటే ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.

అవును, ప్ర‌తి రోజు ప‌ర‌గ‌డుపున కివి పండు తీసుకుంటే శ‌రీరానికి బోలెడంత శ‌క్తి ల‌భిస్తుంది.నీర‌సం, అల‌స‌ట వంటివి దూర‌మై బాడీ ఫుల్ యాక్టివ్‌గా మారుతుంది.

Advertisement
Benefits Of Eating Kiwi Fruit In Empty Stomach! Benefits Of Kiwi Fruit, Empty St

త‌ర‌చూ ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది.అలాగే ఖాళీ క‌డుపుతో కివి పండు తిన‌డం వ‌ల్ల.

అందులో ఉండే ఫైబ‌ర్ కంటెంట్‌ మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య నుంచి విముక్తిని క‌లిగిస్తుంది.అదే స‌మ‌యంలో జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.

అధిక ర‌క్త పోటుతో ఇబ్బంది ప‌డుతున్న వారికి కివి పండు చాలా మేలు చేస్తుంది.ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో కివి పండు తింటే ర‌క్త పోటు స్థాయిలు చ‌క్క‌గా అదుపులోకి వ‌స్తాయి.

అంతే కాదు, ప‌ర‌గ‌డుపు కివి పండ్లు తీసుకుంటే గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం సైతం త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Benefits Of Eating Kiwi Fruit In Empty Stomach Benefits Of Kiwi Fruit, Empty St
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

అయితే మంచిది అన్నారు క‌దా అని ఖాళీ క‌డుపుతో ఎక్కువ కివి పండ్ల‌ను పొర‌పాటున కూడా తీసుకోరాదు.ఇలా చేయ‌డం వ‌ల్ల గ్యాస్‌, గుండెల్లో మంట, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.ఖాళీ క‌డుపుతో కేవ‌లం ఒక్క కివి పండును మాత్ర‌మే తీసుకోవాలి.

Advertisement

అంతుకు మించి తిన‌క‌పోవ‌డ‌మే మంచిది.

తాజా వార్తలు