చిల్లరతో ఐఫోన్ కొనుగోలు చేయాలని ప్రయత్నించిన బిచ్చగాడు.. షాపులోకి రానివ్వలేదంటూ?

ఐఫోన్( iPhone ) కొనుగోలు చేయాలనేది చాలామంది కల అనే సంగతి తెలిసిందే.కొంతమంది ఐఫోన్ కొనుగోలు చేయడానికే పైసాపైసా కూడబెట్టుకుంటూ పొదుపు చేస్తూ ఉంటారు.

అయితే ఒక వ్యక్తి బిచ్చగాడి వేషంలో చిల్లర నాణేలు తీసుకుని ఐ ఫోన్ కొనుగోలు చేయడానికి వెళ్లాడు.వేర్వేరు మొబైల్ షాపులకు ఆ వ్యక్తి వెళ్లగా కొన్ని మొబైల్ షాపులు అతడిని షాపులోకి రావడానికి కూడా అనుమతించకపోవడం గమనార్హం.

మరికొన్ని మొబైల్ షాపులు( Mobile shops ) అతనిని అనుమతించినా అతని దగ్గర ఉన్న చిల్లర చూసి నో చెప్పారు.చివరకు ఒక మొబైల్ షాప్ యజమాని మాత్రం అతని దగ్గర ఉన్న చిల్లర తీసుకుని ఐ ఫోన్ ను ఇచ్చారు.

ఎక్స్ పెరిమెంట్ కింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు బిచ్చగాడు ఐ ఫోన్ కొనడానికి వెళ్తే అతని విషయంలో మొబైల్ షాప్ నిర్వాహకులు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలుసుకోవడానికి ఈ ప్రయోగం చేశారు.

Advertisement

జోధ్ పూర్( Jodhpur ) లో ఈ ప్రయోగం చేసిన బిచ్చగాడి రూపంలో ఉన్న ఈ వ్యక్తికి వేర్వేరు అనుభవాలు ఎదురవుతున్నాయి.ఐ ఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్( iPhone Pro Max model ) ను ఆ వ్యక్తి కొనుగోలు చేయడం గమనార్హం.తాను బిచ్చగాడిని కాదని ప్రాంక్ అని చెప్పడంతో మొబైల్ షోరూం నిర్వాహకులు ఆశ్చర్యపోయారు.

బిచ్చగాడి వేషం వేసుకున్న వ్యక్తి ఐ ఫోన్ ను కొనుగోలు చేయడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఐ ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తికి అంత చిల్లర ఎక్కడినుంచి వచ్చిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ స్టంట్స్ అన్నీ పాత స్టంట్స్ అని కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ట్విట్టర్ లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు