'బెదురులంక'పై భారీ ఆశలు పెట్టుకున్న కార్తికేయ.. పక్కా హిట్ అంటూ..

ఈ మధ్య మన టాలీవుడ్ ప్రేక్షకుల ఆలోచన విధానంలో చాలా మార్పు రావడం వల్ల సినిమాలో కంటెంట్ ఉందా లేదా అని చూస్తున్నారు కానీ అది పెద్ద హీరో సినిమానా చిన్న హీరో సినిమానా అనేది చూడడం లేదు.

దీంతో చిన్న హీరోలు కూడా మంచి కంటెంట్ తో వచ్చి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు.

ఈ క్రమంలోనే మన తెలుగులో కూడా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు తమను తాము నిరూపించు కునేందుకు కష్ట పడుతున్నారు.మరి ఈ లిస్టులో యంగ్ హీరో కార్తికేయ కూడా ఉన్నారు.

కార్తికేయ ఆర్ఎక్స్ 100 వంటి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న తర్వాత తనకంటూ స్పెషల్ ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకున్నాడు.అయితే ఈ సినిమా తర్వాత ఈ రేంజ్ మరో హిట్ కొట్టలేక పోతున్నాడు.

ఇక ఇప్పుడు కార్తికేయ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.కార్తికేయ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా బెదురులంక 2012.ఈ సినిమాను డైరెక్టర్ క్లాక్స్ థ్రిల్లర్ జోనర్ లో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే గ్లిమ్స్ రాగా మంచి స్పందన లభించింది.

Advertisement

ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.ఈ టీజర్ ను విజయ్ దేవరకొండ యూట్యూబ్ లో రిలీజ్ చేసాడు.

ఆ తర్వాత టీజర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్.కార్తికేయ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని.ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించి పక్కాగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేసాడు.చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో.

ఈ సినిమాను లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు