బీట్ రూట్‌తో నిత్య య‌వ్వ‌నంగా మెరిసిపోండిలా!!

బీట్ రూట్.దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.హెల్తీ వెజిటేబుల్ అయిన బీట్ రూట్‌.

ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూర్చుతుంది.శక్తినిచ్చే శాకాహార దుంపల్లో బీట్‌రూట్‌ది మొదటి స్థానం.

అందుకే బీట్ రూట్‌ను ప్ర‌తిరోజు తీసుకోవాల‌ని పోషకాహార నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంటారు.అయితే బీట్ రూట్ ఆరోగ్యప‌రంగానే కాకుండా.

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంలోనూ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి బీట్ రూట్‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
How To Use Beetroot For Glowing Face..? Beetroot, Glowing Face, Beauty Tips, Bea

బీట్ రూట్ పేస్ట్ లో కొద్దిగా పాలు మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం క్లీన్‌ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది.బీట్ రూట్ రసం మరియు షుగర్ రెండింటిని క‌లిపి ముఖానికి స్క్ర‌బ్ చేయాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

How To Use Beetroot For Glowing Face.. Beetroot, Glowing Face, Beauty Tips, Bea

ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది.బీట్ రూట్ పేస్ట్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి ప‌ట్టించాలి.అరగంట తర్వాత ముఖం గోరువెచ్చ‌ని నీటితో క్లీన్‌ చేసుకోవాలి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
ఆరెంజ్ వలన అద్భుత లాభాలు

ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గ‌డంతో పాటు ముడ‌త‌లు పోయి ముఖం య‌వ్వ‌నంగా మారుతుంది.మ‌రియు ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది.

Advertisement

ఇక లిప్స్ న్యాచురల్ గా పింక్ కలర్లో ఉండాలంటే.బీట్ రూట్ ర‌సంలో కొద్దిగా రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి.

పెదాల‌కు అప్లై చేయాలి.ప‌ది నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తిరోజు చేయ‌డం వ‌ల్ల లిప్స్ న్యాచురల్ గా పింక్ కలర్లోకి వ‌స్తాయి.అలాగే బీట్ రూట్ ర‌సంలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి క‌ళ్ల కింద అప్లై చేస్తే.

న‌ల్ల‌టి వ‌లయాలు త‌గ్గుతాయి.

తాజా వార్తలు