బాలయ్య అఖండ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల చేత వాయిదా పడుతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.ముందుగా ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని దర్శకుడు భావించారు.

అయితే అది కుదరని పక్షంలో దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ అఖండ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం భావించినట్లు సమాచారం.త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడనునట్లు తెలుస్తోంది.

Advertisement
Balakrishna, Tollywood, Hero, Akhanda, Movie Release, Film Industry,tollywood N

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కనిపించనున్నారు.ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో సందడి చేయనున్నట్లు తెలిసిందే.

Balakrishna, Tollywood, Hero, Akhanda, Movie Release, Film Industry,tollywood N

ఇప్పటికే బోయపాటి శీను, బాలకృష్ణ దర్శకత్వంలో సింహా, లెజెండ్ వంటి చిత్రాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి.ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి రాబోతున్న ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇక ఈ సినిమా విడుదల పై చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు