'ముందు అలా పిలవడం మానవయ్యా' అంటూ రానాపై బాలకృష్ణ అరిచారు.! ఎందుకో తెలుసా.?

రానా నెం.1 యారి షో లో నందమూరి సింహం బాలకృష్ణ గారు ఇది వరకు పూరి జగన్నాథ్ తో కలిసి పైసా వసూల్ మూవీ ప్రొమోషన్స్ కోసం వచ్చారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ చిత్రం అయిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ప్రొమోషన్స్ కోసం డైరెక్టర్ క్రిష్ తో కలిసి మరో సారి రానా నెం.1 యారి షో కి వచ్చారు.ఈ ఆదివారం ఈ షో జెమినీ టీవీ లో ప్రసారం కాబోతుంది.

 Balakrishna Warned Rana Not To Call Him Sir-TeluguStop.com

అయితే ఈ షో కి సంబందించిన ప్రోమో ని యూట్యూబ్ లో విడుదల చేసారు, ఆ ప్రోమో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.

ఆలా పిలవడం మానవయ్యా :


ప్రశ్నలు అడిగే సమయం లో రానా, బాలకృష్ణ గారిని సార్ అని పిలుస్తుండటం తో, ముందు సార్ అని పిలవడం మానవయ్యా అని బాలయ్య గారు రానా తో అన్నారు.ఈ షో ఆధ్యాంతం చాలా ఫన్నీ గా సాగుతుంది.బాల కృష్ణ గారు ఫన్నీ ఎక్సప్రెషన్స్ పెడుతూ ప్రోమో కె వన్నె తెచ్చారు.

మీ చిన్న వయసులో జరిగిన సంఘటనలు గురుంచి చెప్పండి సార్ అంటూ బాలకృష్ణ గారికి రానా అడిగిన ప్రశ్నకు బాల కృష్ణ గారు సమాధానమిస్తూ ‘నేను ఇప్పటికీ చిన్నవాడినే కదా’ అంటూ సమాధానమిచ్చారు.


బాలయ్య బాబు ఒక చూపు చూస్తే :


సోషియో ఫాంటసీ, రొమాంటిక్ డ్రామా.వీటిలో బాలకృష్ణగారు ఏది ఎంచుకుంటారు అని రానా ప్రశ్నించగా క్రిష్ సమాధానమిస్తూ ‘కచ్చితంగా రొమాంటిక్ డ్రామా’ అని చెప్పారు.దానికి బాలయ్య బాబు గారు క్రిష్ వైపు సరదాగా ఉరిమి చూశారు.

ఇటీవలే కథానాయకుడు, మాహానాయకుడు చిత్ర ట్రైలర్ ని ఈ సినిమా ఈవెంట్ లో విడుదల చేసారు.ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ, అన్నగారిని బాలయ్య బాబు దింపేశారు, అన్న గారి పాత్రకి బాలయ్య బాబు ప్రాణం పోశారు అని మెచ్చుకుంటున్నారు.

ఇంక సినిమా విడుదల అయ్యాక ఎన్ని రికార్డు లను తిరగరాస్తుందనే దానిపైన సినీ విశ్లేషకులు చర్చలు మొదాలుపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube