Bhagavanth Kesari : భగవంత్ కేసరి సినిమాలో ఆ సీన్ గురించి చర్చ.. బాలయ్య మంచి పని చేశారంటూ?

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి( Bhagavanth Kesari ).

ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తాజాగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.

ఈ సినిమా చూసినప్రతి ఒక్కరూ తండ్రి కూతుర్ల మధ్య సన్నివేశాలను( Father Daughter Scenes ) చాలా బాగా చూపించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఆ సంగతి పక్కన పెడితే ఇందులో చిన్న పిల్లలపై సొంత వారు లేదా బయటి వారు చేస్తున్న అఘాయిత్యాల గురించి ఒక సీన్‌ ను పెట్టారు.

లైంగిక స్పర్శలు అసాధారణ స్పర్శల గురించి బాలకృష్ణ( Balakrishna ) స్కూల్‌ లో చిన్న అమ్మాయిలకు చెప్పడంను దర్శకుడు అనిల్‌ రావిపూడి( Anil Ravipudi ) చూపించాడు.బాలయ్య వంటి స్టార్‌ హీరో సినిమా లో ఇలాంటి ఒక మంచి సన్నివేశం ఉండటం అభినందనీయం.ఈ మధ్య కాలంలో అమ్మాయిలు చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు గాను ఎలా ఉండాలి అనే విషయాలను ప్రభుత్వం ప్రచారం చేస్తున్నారు.

Advertisement

తెలిసిన వారి స్పర్శలో కూడా గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ లు( Good Touch, Bad Touch ) ఉంటాయని పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది.అదే ఇప్పుడు కొన్ని స్వచ్చంద సంస్థలు చేస్తున్నాయి.

స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రచారం చేసినా కూడా ఆశించిన స్థాయిలో పని జరుగదు.కానీ సినిమాల్లో అది కూడా పెద్ద హీరోల సినిమాల్లో చూపించడం వల్ల ఎంతో కొంత వరకు అయినా ఫలితం ఉంటుంది అనడంలో సందేహం లేదు.బాలయ్య వంటి స్టార్‌ హీరో సినిమాలో గుడ్ టచ్‌, బ్యాడ్ టచ్ గురించి చర్చించడం ద్వారా ఒక మంచి సన్నివేశంను అందరి వద్దకు తీసుకువెళ్లారని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు