రైల్వే ప్రయాణికుల కోసం వండిన ఆహారాలను తినేస్తున్న ఎలుకలు.. షాకింగ్ వీడియో వైరల్...

భారతీయ రైళ్లలో టాయిలెట్స్ ఎంత అపరిశుభ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక రైళ్లలో తయారు చేసి వడ్డించే ఫుడ్ కూడా చాలా చెత్తగా, అపరిశుభ్రంగా ఉంటుంది.

 Rats Inside Indian Railways Train Pantry Car Details, Mice, Pantry Car, Indian R-TeluguStop.com

అవి క్వాలిటీ లేకపోవడమే కాక అందులో బొద్దింకలు ఇంకా ఇతర పురుగులు వస్తుంటాయి.ఈ ఫుడ్డు తినడం ఎంత ప్రమాదకరమో తెలిపే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇటీవల ఒక ఇండియన్ ట్రైన్‌ ప్యాంట్రీ కారులో( Pantry Car ) ఎలుకలు ఉన్నట్లు, అవి ఆహారాలను తినేస్తున్నట్లు ఒక ప్యాసింజర్ కనుగొన్నాడు.దానికి సంబంధించిన వీడియో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయగా అది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దుమారం రేపింది.

ముంబై మ్యాటర్స్ అనే యూజర్ నేమ్ గల ఒక ప్యాసింజర్ 2023, అక్టోబర్ 14న 11009 LTT మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కాడు.కొంతసేపటికి ప్యాంట్రీ కారులో ప్రయాణికుల కోసం ఉద్దేశించిన ఆహారాన్ని అనేక ఎలుకలు( Rats ) తినేస్తున్నట్లు గమనించాడు.దానిని ఫోన్ కెమెరాలో రికార్డు చేసి ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసాడు.“ప్రయాణికులకు పరిశుభ్రమైన రుచికరమైన ఆహారాన్ని అందించడానికి, నాణ్యత నియంత్రణను పర్యవేక్షించడానికి ఇండియన్ రైల్వేస్( Indian Railways ) ఎలుకలను ఫుడ్ టేస్టర్స్ గా నియమించింది.” అని వినియోగదారు వీడియోకు వ్యంగ్యంగా క్యాప్షన్ ఇచ్చాడు.ప్యాంట్రీ కార్‌లో రెండు ఎలుకలు పెద్ద గిన్నెలోంచి భోజనాన్ని తింటుండటం తాను చూశానని సదరు ప్రయాణికుడు చెప్పాడు.

ఈ వీడియో భారతీయ రైల్వేలు అందించే ఆహార నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రతను బట్టబయలు చేసింది.ఇలాంటి ఫుడ్ కోసమేనా ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జ్ చేసేది అని చాలామంది నెటిజన్లు మండిపడుతున్నారు.కొందరు వ్యక్తులు తమ ఆహారంలో లేదా ప్యాంట్రీ కార్లలో కీటకాలు, బొద్దింకలు, ఇతర పురుగులు కూడా వస్తాయని ఆ సహనం వ్యక్తం చేశారు.ముంబై మ్యాటర్స్( Mumbai Matters ) పోస్ట్ చేసిన వీడియోపై రైల్వేకు ఆహారం, క్యాటరింగ్ సేవలను అందించే బాధ్యత కలిగిన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్పందించింది.

తగు చర్యలు తీసుకున్నామని, పరిశుభ్రత, పరిశుభ్రత పాటించేలా ప్యాంట్రీ కార్ల సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు.అయితే, చాలా మంది నెటిజన్లు ఈ ప్రతిస్పందనతో సంతృప్తి చెందలేదు.రైల్వేల నుండి మరింత జవాబుదారీతనం, పారదర్శకతను కోరారు.మెరుగైన సేవలు, నాణ్యతను ఆశిస్తూ భవిష్యత్తులో ప్రైవేట్ కంపెనీలు రైళ్లను నడపాలని ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube