తెలంగాణలోని నాలుగు నియోజకవర్గాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించిందని తెలుస్తోంది.ఈ మేరకు సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది.
అభ్యర్థుల ఖరారు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఈ నాలుగు నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేయనున్నారని సమాచారం.ఇందులో భాగంగానే మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా పర్యటనలకు పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది.
అయితే బీఆర్ఎస్ ముఖ్యనేతలు పోటీ చేస్తున్న నాలుగు నియోజకవర్గాలను టార్గెట్ గా పెట్టుకుంది.ఈ క్రమంలోనే కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలు, కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల, హరీశ్ రావు పోటీ చేస్తున్న సిద్దిపేటపై బీజేపీ జాతీయ నాయకత్వం గెలుపుదిశగా వ్యూహాలను రచిస్తోంది.
కాగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.