అన్‌స్టాపబుల్‌ : చిరంజీవి ఓకే, బాలయ్య వైపు నుండి సిగ్నల్‌ రావాలట

నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో నటించాడు.

ఆయన్ను కేవలం హీరోగా నే ఇన్నాళ్లు చూస్తూ వచ్చిన అభిమానులకు కొత్త యాంగిల్ ను అన్‌ స్టాపబుల్‌ చూపించి వావ్‌ అనిపించిన విషయం తెల్సిందే.

బాలయ్య ను సరికొత్తగా చూపించడంతో పాటు ఆయనలో ఉన్న కామెడీ యాంగిల్ ను కూడా అన్‌ స్టాపబుల్‌ చూపించింది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో ను అనూహ్యం గా ముగించడంతో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కాని వెంటనే అన్ స్టాపబుల్ కు కచ్చితంగా సీజన్ 2 ఉంటుందని ప్రకటన వచ్చింది.సీజన్ 2 రావడం తో పాటు అభిమానులందరిని ఆశ్చర్యపర్చే విధంగా మెగాస్టార్‌ చిరంజీవి ఈ షో లో కనిపించబోతున్నాడు అనేది చాలా మంది నుండి అందుతున్న సమాచారం.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అన్‌ స్టాపబుల్‌ లో కనిపించేందుకు గాను మెగా స్టార్ నుండి గ్రీన్ సిగ్నల్‌ వచ్చిందట.బాలయ్య కు ఇప్పటికే చిరంజీవి తో షో అనే విషయాన్ని చెప్పారని.

Advertisement

కాని ఆయన నుండి ఒక స్పష్టత అయితే రాలేదు అంటున్నారు. బాలయ్య ఖచ్చితంగా చిరంజీవి తో షో చేసేందుకు ఆసక్తిగా ఉంటాడు.

గతంలో పలు సందర్బాల్లో చిరంజీవి మరియు బాలయ్య లు ఒకే వేదిక పంచుకున్నారు.ముఖ్యం గా బాలయ్య మైలు రాయి సినిమా శాతకర్ణి యొక్క పూజా కార్యక్రమాలకు చిరంజీవి హాజరు అవ్వడం జరిగింది.

ఆ తర్వాత కూడా సందర్బానుసారం గా కలవడం జరిగింది.ఇద్దరి మద్య విభేదాలు లేవు కాని అభిమానుల మద్య గొడవలు ఉన్నాయి అనేది కొందరు చెబుతున్న విషయం.

కనుక అన్‌ స్టాపబుల్‌ లో కచ్చితంగా బాలయ్య.చిరు ల సందడి మనం చూడబోతున్నాం.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు