దసరాకి బాలయ్య కొత్త ప్రాజెక్ట్ ఎనౌన్స్... అనిల్ రావిపూడితోనే

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మొదటి సారి విభిన్నంగా అఘోరా పాత్రలో కనిపించనున్నాడు.

కథలో ఆ పాత్ర చాలా కీలకం అని తెలుస్తుంది.ఇదిలా ఉంటే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడ్డ షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Balakrishna And Anil Ravipudi Movie Announce To Dasara, Tollywood, Nandamuri, Ba

వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళడానికి దర్శకుడు బోయపాటి సిద్ధం అవుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ పేరున్న బి.గోపాల్, బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అందరూ భావిస్తున్నారు.ఇక ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

ఇదిలా ఉంటే బాలకృష్ణ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ తాజాగా వినిపిస్తుంది.గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్యబాబు సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది.

Advertisement

అయితే అప్పట్లో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.అయితే తరువాత అనిల్ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు.

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడుగా ఉన్నాడు.ఇదిలా ఉంటే రీసెంట్ గా అనిల్ బాలకృష్ణని కలిసి కథ చెప్పడం జరిగిందని, బాలయ్య కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాని దసరాకి అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.ఇక వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక అనిల్ రావిపూడి యాంగిల్ లో సాగె కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం.

కోలీవుడ్ హీరోతో చరణ్ మల్టీస్టారర్ మూవీ... ఖుషి అవుతున్న మెగా ఫాన్స్! 
Advertisement

తాజా వార్తలు