నెట్‌ఫ్లిక్స్‌ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్... ఇకనుండి నో పాస్‌వర్డ్‌ షేరింగ్‌!

ఒకప్పుడు ఫారిన్ కంట్రీలలో మాత్రమే సందడి చేసిన OTTలు మనదేశంలోకి కూడా వచ్చేసాయి.ముఖ్యంగా కరోనా తరువాత ఈ మేకోవర్ వచ్చిందని చెప్పుకోవాలి.

ఈ క్రమంలోనే ప్రముఖ OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇక్కడ భారీగానే వినియోగదారులను సంపాదించింది.మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొనే మన తెలుగు సినిమాలను ఈ OTT భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేస్తోంది.

ఒక్క నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా ఇతర OTTలకు కూడా డిమాండ్ ఏర్పడింది.ఇంటిల్లిపాది సినిమాను చూసే వెసులుబాటు ఉండడంతో జనాలు కూడా OTTల వైపు మళ్లారు.

ఇకపోతే వినియోగదారులను ఆకర్శించడానికి పలు OTTలు మొదట ఇచ్చిన సౌకర్యాలను కాలక్రమేణా తగ్గించేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం నుంచి నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్ షేరింగ్‌ను పూర్తిగా అరికట్టాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

చాలా కాలంగా నెట్‌ఫ్లిక్స్ తక్కువ సభ్యత్వాల వెనుక పాస్‌వర్డ్ షేరింగ్‌ ఉందని తెలుసుకుంది.వినియోగదారులను ప్రభావితం చేయకుండా ఈ సమస్యను అధిగమించడానికి కంపెనీ ట్రై చేసింది.

కానీ అది కానీ పరిస్థితి.అందుకే ఈ పాస్‌వర్డ్ షేరింగ్‌ అనే ఆప్షన్ ని పూర్తిగా ఎత్తివేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ రీడ్ హేస్టింగ్స్ తన సీనియర్‌లకు పాస్‌వర్డ్ షేరింగ్ సమస్య తక్కువ సభ్యత్వాలకి ప్రధాన కారణమని తెలిపారు.వీరి విశ్లేషణ ప్రకారం కుటుంబం, స్నేహితుల నుంచి అరువు తెచ్చుకున్న పాస్‌వర్డ్‌లను ఉపయోగించి 100 మిలియన్ల మంది వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్‌ను చూస్తున్నారని తెలిపారు.అందుకే 2023 నుంచి నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌లను షేర్‌ చేసుకునేవారికి ఛార్జీ విధించడం ప్రారంభిస్తుంది.

దీనికి సంబంధించి వచ్చే ఏడాది USలో అప్‌డేట్‌ను విడుదల చేస్తుందని భావిస్తున్నారు.

వైరల్ వీడియో : వ్యూస్ కోసం యూట్యూబర్ రైల్వే ట్రాక్ పై ఏకంగా..?
Advertisement

తాజా వార్తలు