సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు నిత్యం అప్లోడ్ అయినా కొన్ని మాత్రం చాలా ప్రత్యేకతని సంతరించుకుంటూ ఉంటాయి.అందులో ఈమధ్య కాలంలో పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా నెటిజన్లను అలరిస్తున్నాయి.
సాధారణంగా మనదగ్గర చాలా ఇళ్లల్లో కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ వుంటారు.ఎందుకంటే విశ్వాసంలో అది ఎవ్వరికీ సాటిలేనిది కనుక.
కొన్ని సార్లు అవి తమ యజమాని పట్ల చూపించే ప్రేమ చూస్తే చాలా అతిశయంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ఓ పెంపుడు కుక్కకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సదరు వీడియోని ఒక్కసారి చూసినట్లయితే….ఒక మహిళ తన కూతురికి ఏదో విషయంలో భయం చెప్పడానికి ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో ఆమెని కొట్టడానికి ట్రై చేస్తోంది.ఆ దృశ్యాన్ని కాస్త దూరం నుండి చూసిన వారి పెంపుడు శునకం ఒక్క ఉదుటున పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెని కొట్టొదని వారించడం ఇక్కడ చూడవచ్చు.
ఆ బాలిక దగ్గరకు వెళ్లి కౌగించుకుని తల్లి నుంచి రక్షణ ఇవ్వడానికి శతవిధాలా ప్రపత్నిస్తోంది.

కాగా ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.నెటిజన్లు కుక్క ప్రయత్నాన్ని తెగ పొగుడుతున్నారు.ఇప్పటి వరకు ఈ వీడియోకు 45 వేలకు పైగా వీక్షణలు రాగా వేల కొద్దీ లైక్‌లు, కామెంట్‌లు రావడం కొసమెరుపు.
ఒక యూజర్ ‘కుక్కను మించిన విశ్వాసి ఈ భూ ప్రపంచంలో ఉండడు’ అని కామెంట్ చేయగా….మరో యూజర్ ‘స్వచ్ఛమైన ప్రేమకి ఈ శునకాలు నిదర్శనం’ అని రాసుకొచ్చాడు.
మరో యూజర్… ఆ బాలికను ఆ బుజ్జి కుక్క ఎంతగా ప్రేమిస్తుందో.కల్మషం లేని ప్రేమ.
అని కామెంట్ చేసాడు.







