జలుబును తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు

కాలం మారుతుంది.వర్షాలు ప్రారంభం అయ్యాయి.

ఇలా సీజన్ మారినప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

ఆ సమస్యల్లో ఒకటి జలుబు.

జలుబు వచ్చిందంటే ఒక పట్టాన వదలదు.జలుబు రాగానే చాలా మంది ఇంగ్లిష్ మందులను వేసుకుంటూ ఉంటారు.

అయితే ఆ మందుల వలన ప్రయోజనం కొంతవరకు మాత్రమే ఉంటుంది.ఆలా కాకుండా కొన్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా సులభంగా జలుబు నుండి బయట పడవచ్చు.

Advertisement

ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.వెల్లుల్లి రెబ్బను నలిపి వాసన చూస్తూ ఉండాలి.

ఇలా రెండు గంటలకు ఒకసారి వాసన చూస్తే మంచి ఫలితం కనపడుతుంది.అలాగే ఒక వెల్లుల్లిని తినాలి.

అయితే గ్యాస్ ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు.ఒక కప్పులో నీటిలో ఒక స్పూన్ బార్లీ గింజలను వేసి ఉడికించి ఆ నీటిని వడకట్టాలి.

ఈ నీటిలో నిమ్మరసం కలిపి త్రాగితే జలుబు తగ్గటమే కాకుండా గొంతు మంట కూడా తగ్గుతుంది.లేత దానిమ్మ ఆకులను నలిపి వాసన చూస్తూ ఉంటే తొందరగా జలుబు తగ్గుముఖంపడుతుంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
మంగళ వారం ఈ పనులు చేస్తే ఏమి అవుతుందో తెలుసా?

ఈ విధంగా రోజులో మూడు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.క్యాబేజి కూడా జలుబును తగ్గించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

Advertisement

ఒక కప్పు నీటిలో క్యాబేజీని ఉడికించి ఆ నీటిని త్రాగాలి.ఈ విధంగా రోజులో రెండు సార్లు చేయాలి.

ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు,మిరియాల పొడి వేసుకొని త్రాగితే జలుబు మాయం అయ్యిపోతుంది.ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

తాజా వార్తలు