ఆస్ట్రేలియాలో తెలుగోడి చరిత్ర.. అత్యున్నత సంస్థకు అధినేతగా నియామకం..!!

వృత్తి, విద్యా, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అనేక రంగాల్లో కీలక హోదాల్లో వున్న సంగతి తెలిసిందే.

రాజకీయ, ఆర్ధిక, సామాజిక, న్యాయ రంగాల్లో అత్యున్నత పదవులను అలంకరిస్తున్నారు భారతీయులు.

వీరిలో తెలుగువారు కూడా వుండటం మనందరికీ గర్వకారణం.తాజాగా ఆస్ట్రేలియాలో ప్రవాసాంధ్రుడు కొత్త చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తదుపరి అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్‌ నియమితులయ్యారు.తద్వారా ఈ పదవిని అలంకరించిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కాడు.2022 మే నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.నానోటెక్నాలజీలో అపార అనుభవమున్న జగదీష్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లో భౌతిక శాస్త్రం పరిశోధకుడిగా కొనసాగుతున్నారు.దీనిపై జగదీష్ స్పందిస్తూ.1990లో రెండేళ్ల కంట్రాక్ట్‌తో ఆస్ట్రేలియన్ అకాడమీకి వచ్చానన్న ఆయన.ఇప్పుడు ఆ సంస్ధకే అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదని హర్షం వ్యక్తం చేశారు.గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందిన చెన్నుపాటి జగదీశ్.1977లో ఆంధ్రా యూనివర్సిటీ లో పీజీ పూర్తి చేశారు.అనంతరం 1988లో ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తిచేసి అనంతరం కేనడాకు వలస వెళ్లారు.అక్కడ కొన్నాళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసిన జగదీశ్.1990లో తన మాకాన్ని ఆస్ట్రేలియాకు మార్చారు.అక్కడ ఆప్ట్రో ఎలక్ట్రానిక్స్, నానోటెక్నాలజీ రంగాల్లో ఓ పరిశోధన సంస్థను స్థాపించారు.

Australian Academy Of Science Appoints Telugu Nri Chennupati Jagadish As Preside

ఆయన సేవలకు గుర్తింపుగా 2016లో ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారమైన ‘‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’’ను జగదీష్‌ అందుకున్నారు.అలాగే భార్య విద్యతో కలిసి ‘‘ ది చెన్నుపాటి అండ్ విద్యా జగదీశ్ ఎండోమెంట్’’ పేరిట విద్యార్ధులు, పరిశోధకులు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్‌కు వ గాను సాయం చేస్తున్నారు.ఆస్ట్రేలియాలోని మెటీరియల్ రీసెర్చ్ సోసైటీలో జగదీశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Advertisement
Australian Academy Of Science Appoints Telugu Nri Chennupati Jagadish As Preside

అంతేకాకుండా అప్లయిడ్ ఫిజిక్స్ రివ్యూస్‌ (ఏపీఆర్)కు ఎడిటర్ ఇన్ చీఫ్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు