యాదాద్రి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది.రూ.

లక్ష లంచం తీసుకుంటూ భువనగిరి మండల అగ్రికల్చర్ ఏవో వెంకటేశ్వర రెడ్డి ఏసీబీకి చిక్కారు.ఎరువుల షాప్ అనుమతి కోసం ఏవో లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు.

దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటూ ఉండగా వెంకటేశ్వర రెడ్డిని అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అనంతరం భువనగిరిలో ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు