కుట్ర ప్రకారమే జగన్ పై దాడి..: మంత్రి అంబటి

విజయవాడ( Vijayawada )లో కుట్ర ప్రకారమే సీఎం జగన్( CM Jagan ) పై దాడి జరిగిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

జగన్ ను హతమార్చాలనే కుట్ర చంద్రబాబు( Chandrababu ) చేస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు.జగన్ ఏనాడూ సానుభూతి కోసం ప్రయత్నించలేదని పేర్కొన్నారు.అధికారం పోయిందంటే చంద్రబాబు సహించలేకపోతున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారన్న అంబటి రాంబాబు( Ambati Rambabu ) అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని ఆరోపణలు చేశారు.విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా అని ప్రశ్నించిన అంబటి పవన్ సినిమా యాక్టర్ అని చూసేందుకు వస్తున్నారన్నారు.

జగన్ పై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించారని తెలిపారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు