కృష్ణ జిల్లాలో దారుణం.. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..!

అనుమానం అనే వైరస్ కుటుంబాలను నాశనం చేసేంతవరకు విడిచిపెట్టదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఇద్దరు పిల్లల్ని అనాధలుగా మార్చిన ఘటన కృష్ణా జిల్లాలోని కుమ్మమూరు గ్రామంలో అందరిని కలచివేసింది.

అసలు ఏం జరిగిందో చూద్దాం.వివరాల్లోకెళితే.

కృష్ణాజిల్లా( Krishna district )లోని తోటవల్లూరు మండలం కుమ్మమూరు గ్రామానికి చెందిన వీర్ల రామకృష్ణ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన రమ్యతేజ అనే యువతిని ప్రేమించాడు.ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు చెప్పి, ఒప్పించి వివాహం చేసుకున్నారు.

రామకృష్ణ,రమ్యతేజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం.కొంతకాలం పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది.

Advertisement
Atrocious In Krishna District.. Husband Killed His Wife On Suspicion..! Husband

కానీ గత కొంతకాలంగా వీరి కాపురంలో చిన్నగా మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి.రామకృష్ణ బాధ్యతలను మరిచి చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు.

Atrocious In Krishna District.. Husband Killed His Wife On Suspicion.. Husband

భార్య రమ్య తేజ( Ramya Teja ) బుకింగ్ కీపర్ గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది.కానీ రామకృష్ణ చెడు వ్యసనాలకు బానిస కావడమే కాకుండా భార్యను అనుమానించి వేధించేవాడు.తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో రమ్య తేజ తల్లిదండ్రులు అల్లుడు రామకృష్ణ పై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు.

అయినా కూడా రామకృష్ణ లో మార్పురాలేదు.

Atrocious In Krishna District.. Husband Killed His Wife On Suspicion.. Husband

తాజాగా శనివారం ఈ దంపతుల మధ్య మరోసారి గొడవ ప్రారంభమై తారస్థాయికి చేరింది.క్షణికావేశంలో తనను తాను కంట్రోల్ చేసుకోలేక పోయిన రామకృష్ణ( Ramakrishna ) చార్జింగ్ వైర్ తో రమ్య తేజ మెడకు చుట్టి ఊపిరి ఆడనీయకుండా చేసి హత్య చేశాడు.భార్యను హత్య చేసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి చేసిన నేరం చెప్పి లొంగిపోయాడు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఎఫ్‌బీఐకి సారథ్యం.. అత్యున్నత పదవికి అడుగు దూరంలో కాష్ పటేల్..!

తల్లి మృతదేహం వద్ద చిన్నారులు తల్లి కోసం రోదిస్తున్న ఘటన స్థానికులను కలచివేసింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు