ఆషాడ మాసంలో ఏ వస్తువులు దానం చేయాలి... గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు..?

మన తెలుగు మాసాలలో నాలుగవ మాసాన్ని ఆషాడ మాసం అంటారు.ఆషాడ మాసం ఎన్నో పూజలు వ్రతాలు పండుగలకు పవిత్రమైన మాసం అని చెప్పవచ్చు.

ఆషాడ మాసంలో కేవలం పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు తప్ప మిగిలిన పూజా కార్యక్రమాలకు వ్రతాలకు ఎంతో పవిత్రమైన మాసం అని చెప్పవచ్చు.ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢమాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆషాడమాసంలో కొత్తగా పెళ్లయిన వారు ఎందుకు దూరంగా ఉంటారు? ఆడపిల్లలు ఆషాడ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? ఆషాడం లో ఏ ఏ వస్తువులను దానం చేయాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.ఎంతో పవిత్రమైన ఆషాడ మాసంలో పాదరక్షకులు, ఉప్పు, గొడుగును దానం చేయాలి.

ఈ విధమైనటువంటి వస్తువులను దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.ఆషాడ మాసంలోనే మనకు సూర్యుడు మకర రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది.

ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు.ఈ మాసంలో అధిక వర్షాలు రావడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు.

Advertisement
Ashada Masam 2021 Dates Importance And Significance, Ashada Masam, Ashada Masam

అయితే ఈ అనారోగ్య సమస్యల నుంచి తమని కాపాడమని మహిళలు అన్నం, బెల్లం, పసుపు నీరు, వేపాకులతో బోనం తయారు చేసే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.

Ashada Masam 2021 Dates Importance And Significance, Ashada Masam, Ashada Masam

ఆషాఢ మాసంలోనే విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్లారని పురాణాలు చెబుతున్నాయి.అందుకోసమే ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించరు.అదేవిధంగా కొత్తగా పెళ్లైన వధూవరులు ఒకే ఇంటిలోనే కలిసి ఉండకూడదని పెద్దలు చెబుతారు.

ముఖ్యంగా ఆషాఢమాసం వస్తుందంటే చాలు మహిళలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎంతో అందంగా ముస్తాబు అవుతారు.ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయని చెబుతారు.

ఆషాడ మాసం వేసవికాలం పూర్తయి వర్షాకాలం ప్రారంభం అవడంతో వాతావరణంలోని ఉష్ణోగ్రత ఉన్నఫలంగా మారిపోతాయి.అందుకోసమే మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన శరీరంలో కూడా వేడి తగ్గించే అవకాశం ఉంటుంది కనుక ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవాలని అనాది నుంచి మన పెద్దలు పాటించేవారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు