ఈ ఏడాది ఆషాడ మాసం అమావాస్య ఎప్పుడు వచ్చింది.. అమావాస్య పూజ ఎలా చేయాలి?

మన హిందూ ఆచారాల ప్రకారం ప్రతి నెల ఎన్నో ప్రత్యేకతలతో మన ముందుకు వస్తుంది.ఈ విధంగానే ఆషాఢ మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.

ముఖ్యంగా ఆషాఢమాస అమావాస్య రోజును ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు.ఈ ఆషాఢ అమావాస్యను ఆషాధి అమావాస్య లేదా హలహరి అమావాస్య అని కూడా అంటారు.వ్యవసాయం చేసే రైతులకు ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకమైనది.

ఈ అమావాస్య రోజు రైతులు తమ పంట పొలాలు ఎంతో పచ్చగా ఉండాలని ఆ భగవంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.ఈ క్రమంలోనే వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది? ఈ అమావాస్య రోజు ఏ విధమైనటువంటి పూజలు నిర్వహించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఈ ఏడాది ఆషాఢ అమావాస్య 2021 జులై 9వ తేదీన వచ్చింది.

శుక్రవారం అమావాస్య ఉదయం 5:16 గంటలకు ప్రారంభమై పదవ తేదీ ఉదయం 6:46 ముగిసింది.ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలను చేయరు.

ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య రోజున వేకువ జామునే నిద్రలేచి నదీ స్నానం చేయాలి.అదేవిధంగా సూర్యభగవానుడికి నమస్కరించి నీటిని తర్పణంగా వదలాలి.

అదేవిధంగా ఈ అమావాస్య రోజు పూర్వీకుల కోసం ఉపవాసం ఉండి వారినీ తలచుకోవడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది.

ఆషాఢ అమావాస్య రోజున మన స్తోమతను బట్టి నిరుపేదలకు దానధర్మాలు చేయడం ఎంతో పుణ్య ఫలాన్నిస్తుంది.అదే విధంగా ఈ అమావాస్య రోజున ఉదయము రావిచెట్టుకు నీరు అర్పించి సాయంత్రం రావిచెట్టుకు దీపాన్ని వెలిగించి పూజించాలి.ఈ ఆషాఢమాసం సూర్యుడు మకర రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కనక ఆరు నెలల కాలాన్ని దక్షిణ యానం అని పిలుస్తారు.

అదేవిధంగా ఈ దక్షిణ యానం లో వచ్చే ఆషాఢమాసంలో తెలంగాణలో అమ్మ వారికి బోనాలను సమర్పించడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తున్నది.అదేవిధంగా జగన్నాథుని రథ యాత్ర కూడా ఈ ఆషాఢమాసంలోనే జరగడం ఈ ఆషాఢమాసం యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

తాజా వార్తలు